Wayanad Landslide : దేవతలు నడయాడే చోటుగా పేరున్న కేరళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా వయనాడ్ లో కొండ చరియలు విరిగి పడడంతో సుమారు 330 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది గాయ పడ్డారు. ఇంకా శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని అధికారులు చెబుతున్నారు. అలాగే వందలాది మంది ఆచూకీ తెలియరావడం లేదంటున్నారు. ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రాంతం ఇప్పుడు మరు భూమిగా మారిపోయింది. ఈ ఘటన తో దేశం మొత్తం దిగ్భ్రాంతిలో కూరుకుపోయింది. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వయనాడ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మృతులు, బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా కేరళ ప్రజలను ఆదుకోవడంలో భాగంగా ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు భారీగా విరాళాలు ప్రకటించారు.
Wayanad Landslide…
తాజాగా నయనతార(Nayanthara)- విఘ్నేశ్ శివన్ దంపతులు కూడా వయనాడ్ బాధితుల కోసం తమ వంతు విరాళం ప్రకటించారు. కేరళకు జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తి చేయలేరంటూ నయనతార భర్త విగ్నేష్ శివన్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తమ వంతుగా రూ. 20 లక్షలు అందిస్తున్నట్లు అందులో వారు తెలిపారు.
‘ కేరళ ప్రజల కష్టాలను చూస్తుంటే కన్నీటితో తమ గుండె బరువెక్కిపోతోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటోన్న అందరికీ ధన్యవాదాలు. ఈ విపత్తు నుంచి కేరళ ప్రజలు తొందరగా బయట పడాలి’ అని నయన తార దంపతులు ఆకాంక్షించారు.
Also Read : Janhvi Kapoor : తనపై జరుగుతున్న ట్రోలింగ్ కి స్పందించిన జాన్వీ