Chhaava : లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన చిత్రం ఛావా(Chhaava). మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ విరోచిత జీవిత గాథను తెరకెక్కించాడు అద్భుతంగా . ఎవరూ ఊహించని రీతిలో సూపర్ సక్సెస్ అయ్యింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసేసింది. పూర్తిగా చారిత్రాత్మక నేపథ్యంతో తీసిన ఈ మూవీ ఆద్యంతమూ ఊత్కంఠను రేపింది. హిందువుల మనోభావాలను ప్రతిఫలించేలా చేసింది. చాలా మంది ప్రేక్షకులు థియేటర్లలో ఆఖరి సీన్స్ ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.
Chhaava OTT Updates
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. శంభాజీ మహరాజ్ విరోచిత గాధను చూసిన ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు కురిపించారు. ఆయన కూడా కంటతడి పెట్టారు. ఏకంగా ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. ఇందులో విక్కీ కౌశల్ శంభాజీగా, ఆయన భార్య ఏసుభాయిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. అయితే థియేటర్లలో ఛావా చిత్రాన్ని చూడాలని అనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది.
కేవలం హిందీలో మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో ఇతర భాషలలో చూడాలని అనుకునే ప్రేక్షకులకు షాక్ తగిలింది. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సీరియస్ గా స్పందిస్తున్నారు. వెంటనే నెట్ ఫ్లిక్స్ తెలుగు , తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ భాషలలో స్ట్రీమింగ్ చేయాలని కోరుతున్నారు. కాగా దీనిపై ఇంకా స్పందించ లేదు నెట్ ఫ్లిక్స్ సంస్థ. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే ఛావా ఓటీటీలోనూ దుమ్ము రేపనుందని తేలి పోయింది.
Also Read : Hero Vijay Sethupathi-Puri :పూరి విజయ్ సేతుపతి మూవీలో టబు