Trisha Krishnan : త్రిష సిగ్నల్ కోసం ఒక ప్రాజెక్ట్ వైటింగా

ప్రస్తుతం త్రిషతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోంది...

Trisha Krishnan : త్రిషకృష్ణన్‌ చిత్ర పరిశ్రమకు పరిచయమై పాతికేళ్లయ్యింది. 1999లో తమిళ చిత్రం ‘జోడి’తో కోలీవుడ్‌కు పరిచయమైన ఆమె అయితే 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంతో టాలీవుడ్‌లో దిగింది. ‘ వర్షం’ చిత్రంతో ఫామ్‌లోకి వచ్చింది. అయితే అప్పటికీ ఇప్పటికీ ఆమె అందంలో ఎలాంటి మార్పూ లేదు. అదే ఛార్మింగ్‌, అదే.. స్పీడు. ఒకప్పటితో కంపేర్‌ చేస్తే ఇప్పుడు మరింత వేగంగా సినిమాలు చేస్తోంది. పారితోషికం కూడా రెట్టింపే. ప్రస్తుతం చిరంజీవితో ‘విశ్వంభర’ చేస్తోంది. త్రిష(Trisha Krishnan)కు సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. దాంతో తెలుగులో కొత్త సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. హిందీతో విజయవంతమైన ‘కిల్‌’తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. రమేష్‌ వర్మ దర్శకుడు. లారెన్స్‌ రాఘవ కథానాయకుడు. ఇందులో త్రిషని కథానాయికగా ఎంచుకొన్నట్టు తెలిసింది.

Trisha Krishnan Movies Update

ప్రస్తుతం త్రిషతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోంది. తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రానికి ‘కిల్‌’ అనే టైటిల్‌నే ఖరారు చేశారట. మంగళవారం లారెన్స్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌తోపాటు టైటిల్‌ ప్రకటిస్తారని సినీ వర్గాల నుంచి సమాచారం. లారెన్స్‌ కథానాయకుడిగా ‘బెంజ్‌’ అనే ఓ తమిళ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ కూడా మంగళవారం రాబోతోంది. ‘ కిల్‌’ రీమేక్‌పై మంచి అంచనాలున్నాయి. త్రిష ఖాయమైతే, ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్‌ దక్కుతుంది.

Also Read : Sai Pallavi : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే

MoviesTrendingTrisha KrishnanUpdatesViral
Comments (0)
Add Comment