ప్రముఖ బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ కు అరుదైన గౌరవం లభించింది. దేశంలో సినిమా రంగానికి సంబంధించి అత్యున్నతమైన పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే కు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆమె సినీ రంగానికి చేసిన కృషికి తగిన గుర్తింపు లభించింది.
భారతీయ చలన చిత్ర పరిశ్రమకు జీవిత కాలం సహకారం అందించినందుకు గాను ఎంపిక చేసినట్లు పేర్కొంది. భారతీయ సినీ పితామహుడిగా ఫాల్కే గుర్తింపు పొందారు. ఈ అవార్డుకు ఎంపికైన నటి వహీదా రెహమాన్ వయసు 85 ఏళ్లు. పలు విజయవంతమైన సినిమాలలో నటించారు.
ఆమె గురుదత్ తో 1957లో ప్యాసా లో నటించారు. 1959లో నటించిన కాగజ్ కే పూల్ దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. సత్యజిత్ రే తీసిన అభిజాన్ లో మెప్పించింది వహీదా రెహ్మాన్. 1966లో వచ్చిన తీస్రీ కసమ్ , 1976లో యష్ చోప్రా తీసిని విజయవంతమైన కభీ కభీ చిత్రంలో నటించింది. ఇవన్నీ చిరస్మరణీయమైన పాత్రలు. అద్భుతమైన గుర్తింపు లభించేలా చేశాయి.
విజయ్ ఆనంద్ తీసిన గైడ్ 1965లో వచ్చింది. ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ మూవీ. 2017లో సింగపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తన అనుభవాన్ని పంచుకున్నారు వహీదా రెహ్మాన్.