The Delhi Files : వివాదాస్పద దర్శకుడిగా పేరు పొందిన వివేక్ అగ్నిహోత్రి ది ఢిల్లీ ఫైల్స్ పేరుతో తెరకెక్కిస్తున్న మూవీకి సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ది ఢిల్లీ ఫైల్స్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేశాడు. తను పూర్తిగా మోడీకి, బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ , హిందూ భావజాలానికి మద్దతుగా ఉన్నాడు. తను తీసిన ది కశ్మీర్ ఫైల్స్ మూవీ కలకలం రేపింది. భారీ ఎత్తున వసూళ్లు సాధించింది.
The Delhi Files Movie Updates
అయితే ఇదే మూవీకి సంబంధించి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది సినిమానే కాదని, అలా అని డాక్యుమెంటరీ అని కూడా చెప్పలేమన్నాడు. అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తనకు పూర్తిగా మద్దతు ఇచ్చారు ప్రధానమంత్రి, ఆయన పరివారం.
ఇదంతా ఓ సెక్షన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం తప్పా తను ఏం చెప్పాలని అనుకున్నాడో సినిమా ద్వారా మెస్సేజ్ ఇవ్వలేక పోయాడన్న అపవాదు మూటగట్టుకున్నాడు. కాగా ది కశ్మీర్ ఫైల్స్ ప్రశంసలతో పాటు విమర్శలకు గురైంది. అయితే ది ఢిల్లీ ఫైల్స్ కు ది బెంగాల్ చాప్టర్ అనేది సబ్ టైటిల్ పెట్టాడు వివేక్ అగ్నిహోత్రి.
కాగా ది ఢిల్లీ ఫైల్స్(The Delhi Files) ను టాలీవుడ్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్బంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. మిథున్ చక్రవర్తి ఇందులో నటిస్తుండడం విశేషం. తనకు ఇటీవలే కేంద్రం అవార్డు ప్రకటించింది.
Also Read : Hero Ravi Teja Movie : రవితేజ ‘మాస్ జాతర’ గ్లింప్స్ రిలీజ్