Laila Movie : విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా నుంచి వైరల్ అవుతున్న సోను మోడల్ సాంగ్

ఇందులో విశ్వక్సేన్ అద్భుతమైన స్టైలిష్, రిచ్ అవతార్‌లో కనిపించారు...

Laila : మాస్ కా దాస్ విశ్వక్ సేన్తన అప్ కమింగ్ చిత్రం ‘లైలా’తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్‌లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా, మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. అది మంచి స్పందనను రాబట్టుకుంది.

Laila Movie New Song

ఇందులో విశ్వక్ సేన్ అద్భుతమైన స్టైలిష్, రిచ్ అవతార్‌లో కనిపించారు. మోడరన్ అవుట్ ఫిట్‌లో స్పోర్టింగ్ షేడ్స్, గోల్డ్ యాక్ససరీస్ ధరించి కూల్ అండ్ కాన్ఫిడెంట్‌గా కనిపించారు. అతని పాత్రను, సోను మోడల్‌గా ప్రజెంట్ చేస్తూ, అతను మెడపై పచ్చబొట్టు, చేతులపై ‘సోను లవర్, సోను కిల్లర్’ అని రాసి ఉన్న టాటూలతో కనిపించాడు. ఆ టాటూలకు అర్థాన్నిచ్చేలా మేకర్స్ ‘సోను మోడల్’ పేరుతో ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్ మంచి ఆదరణను రాబట్టుకుంటోంది.

Also Read : Mura Movie : ఓటీటీ లో హల్చల్ చేస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా

New MoviesTrendingUpdatesViralVishwak Sen
Comments (0)
Add Comment