Laila : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ వరుస చిత్రాల తర్వాత ఊపు మీదున్న విశ్వక్ సేన్ భిన్నమైన పాత్రలో నటించిన లైలా మూవీ వాలంటైన్స్ డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విడుదలైన ఈ మూవీ ఆశించిన మేర ఆకట్టుకోలేక పోయింది. ముందు నుంచీ లేడీ గెటప్ పాత్రలో విశ్వక్ సేన్ నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Laila Movie Updates
అయితే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వీ రాజ్ చేసిన అనుచిత కామెంట్స్ లైలా(Laila)కు బిగ్ షాక్ తెప్పించేలా చేశాయి. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి బాయ్ కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ పేరుతో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు.
అయినా జరగాల్సిన నష్టం, కావాల్సిన డ్యామేజ్ అయ్యింది. విశ్వక్ సేన్ తో పాటు మూవీ మేకర్స్, నటుడు పృథ్వీ రాజ్ సారీ చెప్పినా లైలాను ఆదరించలేదు. ఇందులో సేన్ సోను మోడల్ పాత్రలో నటించాడు. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ నడుపుతుంది.
తన మేకప్ నైపుణ్యాల కోసం మహిళల కోసం పేరు పొందింది. ఒక క్లయింట్ కు సాయం చేసే ప్రయత్నంలో వంట నూనె వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరిస్తుంది. ఈ నిర్ణయం తనను ఊహించని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. సోను నుండి లైలాగా ఎందుకు మారాడు అనేదే కథ. రెండో భాగంలో కొంత ఆకట్టుకున్నా ఆశించిన రీతిలో మనసు దోచుకునే ప్రయత్నం చేయదని చెప్పక తప్పదు. ఇక ఇచ్చుకుందం బేబీ పాట మాత్రమే కాస్తా ఆకట్టుకుంది.
Also Read : Beauty Shraddha Kapoor War 2 :తారక్..రోషన్ తో జతకట్టిన శ్రద్దా కపూర్