Vishwak Sen : విశ్వక్ సేన్ 13 వ సినిమా షూటింగ్ షురూ..

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాతలు నాగ వంశీ, సాహు గారపాటి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు...

Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 13వ మూవీ #VS13, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం. 8 గా ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. విశ్వక్‌ని ఫెరోషియస్ పోలీసుగా ప్రజెంట్ చేసిన ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా ఈ మూవీని ఇటీవల అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో శ్రీధర్ గంటా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీధర్ గంటా రచన, దర్శకత్వం వహిస్తున్న #VS13లో విశ్వక్ సేన్(Vishwak Sen) హానెస్ట్ IPS ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూనిక్ పోలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని మేకర్స్ చెబుతున్నారు. ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా చిత్ర యూనిట్‌తో పాటు మరికొందరు ప్రత్యేక అతిధుల సమక్షంలో గురువారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

Vishwak Sen Movies..

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాతలు నాగ వంశీ, సాహు గారపాటి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ముహూర్తపు షాట్‌కు దర్శకుడు వశిష్ట క్లాప్‌ కొట్టారు. శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. మేకర్స్ అనౌన్స్ చేసిన ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. విశ్వక్ సరసన ఈ సినిమాలో హీరోయి‌న్‌గా నటిస్తున్న కన్నడ బ్యూటీ సంపద కూడా ఈ వేడుకకు హాజరైంది. ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఎ రియాక్షన్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి టాప్ క్లాస్ టెక్నీషియన్స్ పని చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ‘ తంగలాన్’ ఫేమ్ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ‘కాంతార’ ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. విశ్వక్ సేన్(Vishwak Sen) కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం. దర్శకుడు శ్రీధర్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. విశ్వక్ సేన్‌కు, అలాగే మా సంస్థకు ఈ సినిమా మంచి పేరు తెచ్చే సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.

Also Read : Shah Rukh Khan : తన కూతురి కోసం బరువు తగ్గిన బాలీవుడ్ హీరో ‘షారుఖ్ ఖాన్’

MoviesTrendingUpdatesViralVishwak Sen
Comments (0)
Add Comment