Vishwak : నటులు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వైరల్ గా మారారు. ఈ ఇద్దరికి నటసింహం నందమూరి బాలకృష్ణతో అనుబంధం ఉంది. వీరి సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వచ్చారు బాలయ్య . తాజాగా బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ, శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా, ప్రగ్యా జైస్వాల్ కలిసి నటించిన డాకూ మహారాజ్ ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 12న విడుదలైంది. దీనిని నాగవంశీ , సాయి సౌజన్య కలిసి నిర్మించారు.
Vishwak-Siddu Praises..
ఊహించని రీతిలో అంచనాలకు మించి భారీ సక్సెస్ ను మూటగట్టుకుంది. ప్రధానంగా నటసింహం మరోసారి తన నటనతో విశ్వ రూపాన్ని ప్రదర్శించాడు. రికార్డుల మోత మోగిస్తూ బాక్సులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది డాకూ మహారాజ్.
ఈ ఏడాది బిగ్గెస్ట్ మూవీగా బాలయ్య చిత్రం ఉండబోతోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఆశించిన మేర రాణించ లేదన్న అపవాదు మూటగట్టుకుంది.
మరో వైపు డాకూ మహారాజ్ ను విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ కలిసి థియేటర్ కు వెళ్లి సినిమా చూడడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు ఇద్దరు నటులు. మా బాలయ్య నటన, మూవీ సూపర్ అంటూ పేర్కొన్నారు.
Also Read : Trinadha Rao Sorry to Beauty : హీరోయిన్ పై నోరు పారేసుకున్న డైరెక్టర్