Hero Vishwak Sen :సినిమాలంటే ప్రాణం కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరం

లైలా న‌టుడు విశ్వ‌క్ సేన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Vishwak Sen : ఎంత‌గా కాంట్రవ‌ర్సీ అయితే అంత‌గా పాపులారిటీ వ‌స్తుంద‌ని అనుకోవ‌డం భ్ర‌మ మాత్ర‌మేనంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు యంగ్ హీరో విశ్వ‌క్ సేన్(Vishwak Sen). త‌ను కీల‌క పాత్ర లో న‌టిస్తున్న రామ్ నారాయ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లైలా ప్రేమికుల పండుగ రోజు ఫిబ్ర‌వ‌రి 14న శుక్ర‌వారం విడుద‌ల కానుంది.

Vishwak Sen Comments

ఈ సంద‌ర్బంగా సినిమాకు సంబంధించి జ‌రిగిన ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న న‌టుడు పృథ్వీ రాజ్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. వైసీపీ పార్టీ, నేత‌ల గురించి నోరు జారాడు మ‌నోడు. 11 గొర్రెలు మాత్ర‌మే మిగిలాయంటూ ఎద్దేవా చేశాడు. ఈ కామెంట్స్ మొత్తం సినిమాపై ప్ర‌భావం ప‌డింది.

దెబ్బ‌కు దిగి వ‌చ్చారు మూవీ మేక‌ర్స్. స్వ‌యంగా న‌టుడు విశ్వ‌క్ సేన్ మీడియా ముందుకు వ‌చ్చాడు. త‌మ‌కు ఎవ‌రి ప‌ట్లా వ్య‌తిరేక‌త ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశాడు. ద‌య‌చేసి ఎవ‌రైనా త‌మ మ‌నో భావాలు తిన్నాయ‌ని భావిస్తే మ‌న్నించాల‌ని కోరాడు. ఆపై జ‌గ‌న్ రెడ్డికి క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాడు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌తి సినిమా బాగుండాల‌ని, స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటామే త‌ప్పా వివాదాల‌కు దారి తీయాల‌ని కోరుకోమ‌న్నారు. కొంద‌రు అలా కావాల‌ని చేస్తార‌ని పేర్కొన్నాడు. ఇంకొక‌రి గురించి మాట్లాడ‌టం త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌న్నారు. న‌ట‌న‌పై ఫోక‌స్ పెట్టానని, సినిమాలంటే ఇష్ట‌మ‌ని కాంట్రోవ‌ర్సీల‌కు దూరంగా ఉంటాన‌న్నాడు విశ్వ‌క్ సేన్.

Also Read : Beauty Rashmika-Vicky :స్వ‌ర్ణ దేవాల‌యంలో ర‌ష్మిక‌..విక్కీ సంద‌డి

CommentsViralVishwak Sen
Comments (0)
Add Comment