Vishwak Sen: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ యంగ్ హీరోస్ లో విశ్వక్‌సేన్ ఒకరు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ద్వారా తన సినిమాలను తానే ప్రమోట్ చేసుకోవడంలో ఆర్జీవి తరువాత విశ్వక్ సేన్ కే సాధ్యం అనే వాదన టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే… అప్పుడప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్‌లు పెడుతుంటారు. తనపై వచ్చిన విమర్శలకు, ట్రోల్స్‌కు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే తాజాగా విశ్వక్ ఇన్‌స్టా అకౌంట్ డిలీట్ చేసినట్లు కనిపిస్తుండడంతో ఆయన అభిమానులు ఎక్స్‌లో కామెంట్స్ పెడుతున్నారు.
Vishwak Sen Insta Account..
తాజాగా విశ్వక్‌సేన్ తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టారు. సోషల్ మీడియా నుంచి దూరమవుతున్నట్లు అందులో పేర్కొన్నారు. కొన్ని రోజులు పోస్ట్‌లు పెట్టరేమో అని అందరూ భావించారు. కానీ అసలు ఇన్‌స్టాలో అకౌంట్ కనిపించడం లేదు. దీనితో కారణమేంటంటూ ఆయన అభిమానులు ఎక్స్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియాల్లో నెగెటివ్ రివ్యూలు ఇచ్చేవారిపై విశ్వక్‌సేన్ ఇటీవల ఫైర్ అయ్యారు. దీనిపై తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఓ యూట్యూబర్ ‘కల్కి’ రిలీజ్ కాకముందే రివ్యూ ఇవ్వడంపై ఆయన తప్పు పట్టారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియా ఇన్ స్టాకు దూరం కావడంపై అభిమానులు నిరాశ చెందుతున్నారు.
Also Read : Hina Khan: క్యాన్సర్ బారిన పడిన ప్రముఖ బాలీవుడ్ నటి !