Vishwak Sen: విశ్వక్‌సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా వాయిదా

విశ్వక్‌సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా వాయిదా

Vishwak Sen: యువ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నేపథ్యంలో యాక్షన్‌, వినోదం నిండిన కథతో కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ లపై సంయుక్త నిర్మించిన ఈ సినిమాను డిసెంబర్‌ 8 ను విడుదల చేయనున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే అదే సమయంలో నాని ‘హాయ్‌ నాన్న’, నితిన్‌ ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌’ తదితర చిత్రాలు వస్తుండడంతో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది. ఈ సినిమాను ఏడాది మార్చి 8కు వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ పై గతంలో సోషల్ మీడియా వేదికగా హీరో విశ్వక్‌సేన్‌(Vishwak Sen) చేసిన పోస్టులు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారుతున్నాయి.

Vishwak Sen – గతంలో సినిమా రిలీజ్ పై ఘాటుగా స్పందించిన విశ్వక్‌సేన్‌

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ వాయిదా పడే అవకాశాలున్నాయని గతంలో వచ్చిన వార్తలపై విశ్వక్‌ ఘాటుగా స్పందించారు. ‘‘బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్‌ మారుద్దాం అనుకుంటాడు. ఈ సినిమా కోసం ప్రతి ఫ్రేమ్‌లో ప్రాణం పెట్టి పనిచేసి చెబుతున్నా.. డిసెంబర్‌ 8న వస్తున్నాం. హిట్‌, ఫ్లాప్‌, సూపర్‌హిట్‌, అట్టర్‌ ఫ్లాప్‌ అనేది మీ నిర్ణయం. ఆవేశంతోనో లేదా అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదిది. తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారని అర్థమైంది. డిసెంబర్‌ 8 సివాలెత్తిపోద్ది. గంగమ్మతల్లిపై నా ఒట్టు. మహాకాళి మాతో ఉంది. డిసెంబర్‌లో కనుక మా సినిమా విడుదల కాకపోతే ఇకపై నన్ను ప్రమోషన్స్‌లో కూడా చూడరు’’ అని విశ్వక్‌(Vishwak Sen) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అప్పట్లో విశ్వక్‌ పెట్టిన పోస్ట్ టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది.

అయితే దీనిపై స్పందించిన నిర్మాత నాగవంశీ నాని, నితిన్‌తో మా బ్యానర్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి, ఒకేసారి అన్ని విడుదలైతే పోటీ ఉంటుందని భావించి.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ పోస్ట్ పోన్ చేద్దామని నేను అంటానేమోనని విశ్వక్‌ భావించి ఉంటాడు. అనుకున్న తేదీ కాకుండా సినిమా విడుదల వాయిదా వేస్తే ఏ హీరో అయినా ఎంతగానో బాధపడతారు. అందుకే, విశ్వక్‌ అలా పోస్ట్‌ పెట్టాడనుకుంటా… అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసారు. అయితే ఈ సినిమాను నిజంగానే వాయిదా వేయాల్సి రావడంతో ఇప్పుడు విశ్వక్ ఎలా స్పందిస్తాడు అనేది ఉత్కంఠగా మారింది.

Also Read : Mahesh Babu-Rajamouli: రణ్ బీర్ కు అభిమానులమంటున్న స్టార్ హీరో, డైరెక్టర్

gangs of godavariVishwak Sen
Comments (0)
Add Comment