Laila : సాహు గార్లపాటి నిర్మాణ సారథ్యంలో రామ్ నారయణ్ దర్శకత్వంలో లైలా మూవీ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు మూవీ మేకర్స్ అప్ డేట్స్ ఇస్తూ మరింత క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఇందులో విశ్వక్ సేన్(Vishwak Sen) భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు.
Laila Movie Updates
లేడీ ఓరియంటెడ్ రోల్ లో నటిస్తుండడం విశేషం. ఇందుకు సంబంధించిన పోస్టర్ కు మంచి ఆదరణ లభించింది. నెటిజన్లు సైతం ఇతను విశ్వక్ సేనా లేక నిజమైన లేడీ హీరోయినా అంటూ అనుమానం వ్యక్తం చేసేలా తీర్చిదిద్దాడు డైరెక్టర్.
తాజాగా లైలా మూవీ నుంచి థర్డ్ సింగిల్ విడుదలైంది. రాయలసీమ నేపథ్యం , జీర కలిగిన రచయిత, కవి, గాయకుడు పెంచికలదాసు కోయ్ కోయ్ కోడ్ని కోయ్ అంటూ పాడారు. ఇది అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఆఖరులో ఉంది. ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు)న విశ్వక్ సేన్ లైలాను రిలీజ్ చేసేందుకు డిసైడ్ చేశారు దర్శక, నిర్మాతలు. ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు నటుడు. తనకు బాలయ్య బాబు అండ కూడా ఉండడం విశేషం. మొత్తంగా లైలా ఎలా ఉండ బోతోందనే దానిపై ఉత్కంఠ పెరుగుతోంది.
Also Read : Beauty Anshu Ambani : అన్షు స్పెషల్ లుక్ అదుర్స్