Vishal-Vijay: విజయ్ సినిమాను కొట్టేసిన విశాల్

విజయ్ సినిమాను కొట్టేసిన విశాల్

Vishal-Vijay: ఒక హీరో కోసం రాసిన కథను అనివార్య కారణాల వలన వేరొక హీరోతో తీయడం సినిమా ఇండస్ట్రీలో కామన్. అయితే ఆ సినిమా విడుదలై ఫలితం వెలువడిన తరువాత ఆయా హీరోలు కాస్తా బాధపడిన సందర్భాలు ఉంటాయి. అయితే స్టోరీ పూర్తిగా వినకుండానే హీరో సినిమాకు నో చెప్పడం, ఆ స్టోరీ కాస్తా వేరొక హీరోతో తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే అలాంటి అరుదైన సంఘటన ఎదురైయింది అంటున్నారు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి. ఓ హిట్ సినిమా విషయంలో కోలీవుడ్ హీరోలు విజయ్(Vijay), విశాల్ మధ్య జరిగిన ఈ ఘటన ఇటీవల ఓ ఇంటర్వూలో ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దర్శకుడు లింగుస్వామి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Vishal-Vijay Movies Viral

జీకె ఫిల్మ్స్ కార్పోరేషన్ పతాకంపై విక్రమ్ కృష్ణ నిర్మాణ సారథ్యంలో లింగుస్వామి దర్శకత్వం వహించిన సినిమా ‘సండకోళి’ (తెలుగులో పందెం కోడి). 2005లో విడుదలైన ఈ సినిమాలో హీరో విశాల్ సరసన మీరా జాస్మిన్ నటించగా రాజ్ కిరణ్, లాల్, సుమన్ షెట్టి తదితరులు కీలకపాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు,తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. యాక్షన్‌ నేపథ్యంలో రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 30 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన ‘సండకోళి 2’ అశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే ఈ సినిమాను దర్శకుడు లింగుస్వామి ఫస్ట్ విజయ్, జ్యోతికలతో కలిసి తీయాలని అనుకుని హీరో విజయ్ కు కథ చెప్పారట. అయితే కథ పూర్తిగా వినకుండానే విజయ్ ఈ సినిమాకు నో చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లింగుస్వామి… ఈ సినిమాను విశాల్(Vishal) తో తీయాల్సివచ్చిందట.

ఈ విషయం ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ లింగుస్వామి ఏమన్నారంటే.. ‘‘సండకోళి’ కోసం హీరో, హీరోయిన్లుగా విజయ్‌, జ్యోతికను అనుకున్నా. అందుకోసం ఓ రోజు విజయ్‌ని కలిసి సగం కథ వినిపించా. అయితే, కథానాయకుడి పాత్ర ఆయనకు అంతగా నచ్చకపోవడంతో… విజయ్‌ సున్నితంగా తిరస్కరించారు. నేను స్క్రిప్ట్ పూర్తిగా చెప్పాలని అనుకున్నప్పటికీ వేరే స్టోరీలు ఉంటే చెప్పమని ఆయన అన్నారు. దీనితో నేను అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

Also Read : Adivi Sesh Dacoit: అడివి శేష్‌ ‘డెకాయిట్‌’ టైటిల్‌ టీజర్‌ రిలీజ్

linguswamyVijayvishal
Comments (0)
Add Comment