Vishal: మెగా ఫోన్ పట్టనున్న విశాల్‌ !

మెగా ఫోన్ పట్టనున్న విశాల్‌ !

Vishal: ఇప్పటిదాకా నటనతో అలరించిన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌(Vishal)… దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. గతంలో సూపర్ హిట్ అయిన ‘డిటెక్టివ్‌’ సినిమాకు సీక్వెల్ గా తీస్తున్న ‘డిటెక్టివ్‌ 2’ తో దర్శకుడిగా మారబోతున్నారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ‘‘25 ఏళ్ల తరవాత నా కొత్త ప్రయాణం ప్రారంభమైంది. నా కల, కోరిక… జీవితంలో నేను ఎలా ఉండాలని మొదట్లో అనుకున్నానో అది నిజం కాబోతుంది. నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిటెక్టివ్‌ 2’ ప్రాజెక్టు కోసం లండన్‌ బయలు దేరాం. నటుడిగా నాకు మంచి గుర్తింపు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దర్శకుడిగా నా ప్రయత్నానికీ మీ సహకారం ఉంటుందని కోరుకుంటున్నాను’’ అంటూ విశాల్‌ పోస్ట్ చేసారు. దీనితో విశాల్ అభిమానులు, సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

Vishal Movie Updates

2017లో విశాల్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘తుప్పరివాలన్ ’ (తెలుగులో ‘డిటెక్టివ్‌’). మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డిటెక్టివ్‌ 2’ను ప్లాన్ చేశారు విశాల్‌. అయితే కొంతకాలం క్రితం క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుంచి మిస్కిన్ తప్పుకున్నారు. దీనితో ‘డిటెక్టివ్‌ 2’ కోసం విశాల్‌ దర్శకుడిగా మారారు. ప్రస్తుతం హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రత్నం’ సినిమాలో నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 26న విడుదల కానుంది.

Also Read : Nithin: ‘ఇష్క్’ దర్శకుడితో మళ్ళీ కలుస్తున్న నితిన్ !

Detctivevishal
Comments (0)
Add Comment