Vishal: కోలీవుడ్ స్టార్ విశాల్, యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో తెరకెక్కించిన తాజా సినిమా ‘రత్నం’. విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ నటించగా… సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మేనన్, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘భరణి’, ‘పూజ’ వంటి హిట్ సినిమాల తరువాత విశాల్-హరి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ‘రత్నం’ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిచారు. శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై తెలుగులో ఏప్రిల్ 26న సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ ను సంపాదించింది. యాక్షన్ డ్రామాగా సినీ ప్రియులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మే23 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు టీమ్ పేర్కొంది.
Vishal – ‘రత్నం’ కథేమిటంటే ?
తమిళనాడు, ఆంధ్ర సరిహద్దుల్లో సాగే కథ ఇది. లక్ష్యం కోసం హత్యలు చేయడానికైనా వెనకాడని యువకుడు రత్నం (విశాల్(Vishal)). తాను మావయ్య అని పిలుచుకునే ఎమ్మెల్యే పన్నీర్‌స్వామి(సముద్రఖని) అండతో అప్పుడప్పుడూ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ పనులు చక్కబెడుతుంటాడు. పోలీసులకి సగం సమస్యల్ని తగ్గిస్తుంటాడు. ఎమ్మెల్యేకి కుడి భుజంలాంటి రత్నం జీవితంలో ఎన్నో కల్లోలాలు. చిన్నప్పుడే తల్లి రంగనాయకి పోలీస్‌స్టేషన్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. అతని బాల్యం కొంతకాలం జైల్లో గడుస్తుంది. అలాంటి రత్నం జీవితంలోకి మల్లిక (ప్రియభవానీ శంకర్) వచ్చాక కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి. తమిళనాడులోని తిరుత్తణిని అడ్డాగా చేసుకుని ఎన్నెన్నో అరాచకాలకు పాల్పడుతుంటారు లింగం బ్రదర్స్ (మురళీశర్మ, హరీష్ పేరడి). వాళ్లే మల్లికపై హత్యాయత్నం చేయగా, రత్నం కాపాడతాడు. ఇంతకీ మల్లిక ఎవరు? ఆమెని లింగం బ్రదర్స్ చంపాలనుకోవడానికి కారణం ఏమిటి? మల్లికని కాపాడేందుకు రత్నం ఏం చేశాడు? అసలు రత్నం తల్లి రంగనాయకి పోలీస్‌స్టేషన్‌లో ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
Also Read : Allu Arjun: భార్య స్నేహారెడ్డితో కలిసి ఓ దాబాలో భోజనం చేసిన అల్లు అర్జున్ !