Vishal Ratnam: ఊర‌మాస్‌ గా విశాల్ ‘రత్నం’ ట్రైల‌ర్ !

ఊర‌మాస్‌ గా విశాల్ ‘రత్నం’ ట్రైల‌ర్ !

Vishal Ratnam: ‘భరణి’, ‘పూజ’, ‘ఆరు’, ‘యముడు’, సింగం సిరీస్ తో యాక్షన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన హరి దర్శకత్వంలో హీరో విశాల్(Vishal) నటిస్తున్న తాజా సినిమా ‘రత్నం’. ఈ సినిమాలో విశాల్‌ కి జోడిగా ప్రియా భవాని శంకర్ నటిస్తుంది. సముద్రఖని, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Vishal Ratnam Movie Updates

‘భరణి’, ‘పూజ’ వంటి హిట్ సినిమాల తరువాత విశాల్(Vishal)-హరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ‘రత్నం’ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై తెలుగులో ఏప్రిల్ 26న సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి ఆదరణను దక్కించుకోగా… తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేసారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టిట వైరల్ గా మారుతోంది.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే… ఏపీ, త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దులో జ‌రిగే క‌థ నేప‌థ్యంలో ర‌త్నం సినిమా సాగ‌నున్న‌ట్లు తెలుస్తోండ‌గా… అద్యంతం యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో నింపేశారు. హీరోయిన్‌ ను హీరో ప్రేమించ‌డం అవ‌త‌లి వ‌ర్గం చేజ్‌ లు చేయ‌డం, హీరోయిన్‌ పై హ‌త్యాయ‌త్నాలు జ‌ర‌గ‌డం, హీరో వారిని ఎదుర్కొంటూ పోయే దృశ్యాలు ఈ క్ర‌మంలో ఫైటింగ్ సీన్లు ద‌ర్శ‌కుడు హ‌రి త‌న శైలిలో అదిరిపోయేలా చిత్రీక‌రించారు. స‌ముద్ర‌ఖ‌ని, ముర‌ళీశ‌ర్మ‌ల పాత్ర‌లు ఇంట్రెస్టింగ్‌ గా ఉన్నాయి. అంతేకాకుండా దేవీ శ్రీ ప్ర‌సాద్ బ్యా గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫ‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. ట్రైల‌ర్‌ను చూస్తున్నంత సేపు విశాల్ గ‌త చిత్రాలు పొగ‌రు, పందెం కోడిల‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి. ట్రైల‌ర్‌ ను బట్టి చూస్తే ఈ సినిమా మాస్ ప్రేక్ష‌కుల‌కు ఫుల్‌మీల్స్ గా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది.

Also Read : Director Shankar: ఘనంగా శంకర్‌ కుమార్తె వివాహం !

Ratnamvishal
Comments (0)
Add Comment