Vishal: రక్తపాతం సృష్టిస్తోన్న విశాల్ కొత్త సినిమా

రక్తపాతం సృష్టిస్తోన్న విశాల్ కొత్త సినిమా

Vishal: ‘భరణి’, ‘పూజ’, ‘ఆరు’, ‘యముడు’, సింగం సిరీస్ తో యాక్షన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన హరి… హీరో విశాల్ తో మూడో సినిమాకు సిద్ధమయ్యారు. ‘భరణి’, ‘పూజ’, హిట్ సినిమాల తరువాత విశాల్ 34వ సినిమాగా దర్శకుడు హరి కాంబినేషన్ లో ‘రత్నం’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ వివరాలను నటుడు విశాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాగా ‘పూజ’ తెరకెక్కింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి ‘రత్నం’ సినిమాతో మరోసారి యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Vishal – రక్తపాతం ను తలపిస్తున్న ఫస్ట్ షాట్ టీజర్

హీరో విశాల్, దర్శకుడు హరి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘రత్నం’ టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలియజేస్తూ హీరో విశాల్ తన సోషల్ మీడియా వేదికగా ఫస్ట్‌ షాట్‌ టీజర్‌ విడుదల చేశారు. ఓ మైదానంలో వరుసగా లారీలు వెళ్తుంటే వాటి ముందు బర్రెలు, గుర్రాలు గుంపులుగా పరిగెత్తడం, దేవుడి విగ్రహాల ముందు ఓ వ్యక్తి మోకాళ్లపై కూర్చొని ఉండగా విశాల్‌ వెళ్లి అతడి తల నరకడం, నేలపై పడిన ఓ రక్తపు చుక్క ‘రత్నం’ టైటిల్‌గా మారడంవంటి సన్నివేశాలు వీడియోలో కనిపించాయి. దీనిని బట్టి చూస్తే ఈసారి విశాల్- హరి తమ సినిమాలో రక్తపాతాన్ని చూపించనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే వేసవికి రానున్న ‘రత్నం’

ఈ సినిమాలో విశాల్‌ సరసన ప్రియా భవానీ శంకర్‌ నటిస్తోంది. సముద్రఖని, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. విశాల్‌కు(Vishal) ఇది 34వ చిత్రం కాగా వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాల్‌ ఇటీవల ‘మార్క్‌ ఆంటోని’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆ సినిమా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Also Read : Payal Ghosh: ఇండియన్ క్రికెటర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బెంగాలీ భామ

harivishal
Comments (0)
Add Comment