Vishal: విశాల్ ‘రత్నం’ నుంచి ‘చెబుతావా’ సాంగ్ రిలీజ్ !

విశాల్ ‘రత్నం’ నుంచి ‘చెబుతావా’ సాంగ్ రిలీజ్ !

Vishal: ‘భరణి’, ‘పూజ’, ‘ఆరు’, ‘యముడు’, సింగం సిరీస్ తో యాక్షన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన హరి… హీరో విశాల్(Vishal) తో మూడో సినిమాకు సిద్ధమయ్యారు. ‘భరణి’, ‘పూజ’, హిట్ సినిమాల తరువాత విశాల్-హరి కాంబినేషన్ లో ‘రత్నం’ సినిమా తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాస్, యాక్షన్ హీరో విశాల్… యాక్షన్ స్పెషలిస్ట్ హరి దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై తెలుగులో ఏప్రిల్ 26న సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి ఆదరణను దక్కించుకోగా… ఉగాదిని పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా నుంచి ‘చెబుతావా’ అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Vishal Movie Updates

ఈ సినిమాలో విశాల్‌ కి జోడిగా ప్రియా భవాని శంకర్ నటిస్తుంది. సముద్రఖని, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘చెబుతావా’ పాట మంచి మెలోడియస్‌గా, ఎమోషనల్ సాంగ్‌గా మెప్పిస్తోంది. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా సింధూరి విశాల్ గాత్రాన్ని అందించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీ వినసొంపుగా ఉంది. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్‌గా రాబోతోన్న ఈ మూవీకి ఎం సుకుమార్ కెమెరామెన్‌గా, టీ ఎస్ జై ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read : Shruthi Hassan: క్రేజీ ప్రాజెక్ట్ ‘చెన్నై స్టోరీ’ నుంచి సమంత, శృతి హాసన్.. ఇద్దరూ ఔట్ ?

hariRatnamvishal
Comments (0)
Add Comment