Mark Antony Movie : విశాల్ మార్క్ ఆంటోనీ రెడీ

కోర్టులో తొల‌గిన అడ్డంకులు

Mark Antony Movie : త‌మిళ సినీ రంగంలో న‌టీ న‌టుల‌కు కొద‌వ లేదు. ఇప్ప‌టికే స్టార్ హీరోల జాబితాలో చేరి పోయాడు న‌టుడు విశాల్. ఏ పాత్ర‌కైనా న్యాయం చేసే స‌త్తా వున్నోడు. విశాల్(Vishal) తాజాగా న‌టించిన చిత్రం మార్క్ ఆంటోనీ. ఈ సినిమా ప్రారంభం నుంచి పూర్త‌య్యే దాకా అడ్డంకులు ఎదుర్కొంది. కోర్టు కేసు దాకా వెళ్లింది.

Mark Antony Movie Updates

మార్క్ ఆంటోనీ మూవీ విడుద‌ల‌పై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది గ‌తంలో. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. అయితే విశాల్ కు లైకాకు మ‌ధ్య వివాదం చెల‌రేగింది. దీంతో మ‌ధ్య‌లో లైకా కోర్టును ఆశ్ర‌యించింది. విశాల్ త‌మ‌కు రూ. 15 కోట్లు చెల్లించాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీంతో మార్క్ ఆంటోనీ రిలీజ్ చేయొద్దంటూ స్టే విధించింది.

సినిమాకు సంబంధించి చూస్తే న‌టుడు విశాల్ లైకా ప్రొడ‌క్ష‌న్స్ కు రూ. 21.29 కోట్ల రుణాన్ని చెల్లించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. విశాల్ కోర్టును ప‌ట్టించుకోకుండా వీర‌మే వాగై సూడు రిలీజ్ చేశాడు. ఇదిలా ఉండ‌గా రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాల‌ని కోర్టు ఆదేశించింది. దీంతో సెప్టెంబ‌ర్ 12న న‌టుడు విశాల్ హాజ‌ర‌య్యాడు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాడు.

దీంతో సినిమా విడుద‌ల‌కు అడ్డంకిగా ఉన్న స్టే తొల‌గి పోవ‌డంతో 15న రిలీజ్ కానుంది చిత్రం.

Also Read : Salaar Movie : భారీ ధ‌ర‌కు స‌లార్ మూవీ

Comments (0)
Add Comment