Vin Diesel: హాలీవుడ్ యాక్షన్ సినిమాలు చూసే వారికి పరిచయం అక్కర్లేని పేరు ‘విన్ డీజిల్’. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ తో పాటు ఫాస్ట్ ఫైవ్, ఎఫ్ 9, ఫాస్ట్ ఎక్స్, ‘త్రిబుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న ‘విన్ డీజిల్’… హాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోగా కొనసాగుతున్నారు. అయితే ‘విన్ డీజిల్’ పై ఆయన మాజీ వ్యక్తిగత సహాయకురాలు Ms జోనాసన్ సంచలన ఆరోపణలు చేసింది. 2010లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీక్వెల్ షూటింగ్ లో తనపై విన్ డీజిల్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపిస్తోంది. సుమారుగా దశాబ్దం క్రితం అట్లాంటా హోటల్ గదిలో తన సహాయకురాలిగా ఉన్న Ms జోనాసన్ పై విన్ డీజిల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కాలిఫోర్నియా కోర్టులో గురువారం వ్యాజ్యం దాఖలైంది. దీనితో విన్ డీజిల్‌పై Ms జోనాసన్ వేసిన పిటీషన్‌ను విచారించి చట్టపరమైన చర్య తీసుకునేందుకు కొంత సమయాన్ని పొడిగించింది. ఈలోపు ఆమె ఆరోపణపై విచారించాలని కోర్టు సూచించింది.
Vin Diesel – 2010లో “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” షూటింగ్ లో ఏం జరిగింది ?
బాధితురాలు Ms జోనాసన్ కథనం ప్రకారం… 2010లో “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” షూటింగ్ కు గాను విన్ డీజిల్(Vin Diesel), చిత్ర యూనిట్ తో పాటు నేను కూడా అట్లాంటాకు వెళ్లాను. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత అందరం రూమ్‌కు చేరుకున్నాం. మరుసటి రోజు షూట్ కోసం రెడీ అయేందుకు విన్ డీజిల్‌కు కావాల్సిన ఏర్పాట్లు నేను చేశాను. తెల్లవారుజామున హోటల్ నుంచి బయలుదేరడానికి డీజిల్‌కు సహాయం చేసేందుకు అయన గదిలోకి వెళ్లిన సమయంలో మేమిద్దరమే ఉన్నాం. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న విన్ డీజిల్(Vin Diesel) నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నన్ను బలవంతంగా పట్టుకుని నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వద్దని వారించినా పదేపదే తాకుతూ నా దుస్తులు తొలగించే ప్రయత్నం కూడా చేశాడు. నేను ఆ సమయంలో బయంతో బాత్‌రూమ్‌లోకి పారిపోయాను అక్కడ నన్ను గోడకు అతికించి బలవంతంగా లైంగిక దాడి చేశాడు.
ఇదంతా జరిగిన మరుసటి రోజు, విన్ డీజిల్(Vin Diesel) సోదరి సమంత విన్సెంట్‌కు జరిగిన విషయం చెప్పాను. కానీ ఆమె అవన్నీ ఏమీ పట్టించుకోలేదు. ఆ సమయంలోనే నన్ను ఆ ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఈ విషయంలో నేను ఆమెతో చాలా సేపు గొడవపడ్డాను కూడా. విన్ డీజిల్ లైంగిక వేధింపులను ఆమె కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది.’ అని Ms జోనాసన్ కోర్టుకు సమర్పించిన వ్యాజ్యంలో తెలిపింది.
విన్ డీజిల్, సమంత విన్సెంట్ వల్ల తాను ఎంతో కెరియర్ కోల్పోయానని ఆమె తెలిపింది. అతని వల్ల తన కెరియర్‌కు జరిగిన నష్టాన్ని పూరించాలని ఆమె కోరింది. అయితే Ms జోనాసన్ వేసిన వ్యాజ్యంపై విన్ డీజిల్ ప్రతినిధులు ఇంకా స్పందించ లేదు. 2017లో వచ్చిన ‘త్రిబుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ అనే చిత్రంలో విన్ డీజిల్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంతో విన్ డీజిల్ ఇండియాలో మరింత పాపులర్ అయ్యాడు.
Also Read : Prabhas Salaar : ప్రభాస్ నటించిన సాలార్ ప్రీ-సేల్స్‌లో రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు