Vikram Thangalaan: విక్రమ్‌ ‘తంగలాన్‌’ వాయిదా !

విక్రమ్‌ ‘తంగలాన్‌’ వాయిదా !

Vikram Thangalaan: నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘తంగలాన్‌’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్‌, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా రంజిత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జనవరి 26న విడుదల చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘నేను ఇప్పటి వరకు ఏ సినిమా కోసం ఇంత కష్టపడలేదు. ఇదొక విభిన్నమైన కథ. ఇందులో గ్లామర్‌కు చోటులేదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది’ అని ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హీరో విక్రమ్‌ తెలిపారు. దీనికితోడు శివపుత్రుడు సినిమాకు మించి విక్రమ్(Vikram) లుక్ ఉండటంతో… ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

Vikram Thangalaan Updates

సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈ సినిమాను ఏప్రిల్ కు వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే సినిమా వాయిదా వెనుక కారణాలు, అదే విధంగా ఏప్రిల్ లో ఏ తేదీన విడుదల చేస్తారు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. దీనితో ‘తంగలాన్‌(Thangalaan)’ కోసం జనవరి 26కోసం ఎదురుచూస్తున్న కొంతమంది విక్రమ్, పా రంజిత్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అయితే మరికొంత మంది మాత్రం లేటుగానైనా లేటెస్ట్ గా చియాన్ వస్తాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న తంగలాన్ సినిమాలో విక్రమ్ సరసన మాళవిక మోహన్ కథానాయికగా నటిస్తోంది. నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాలో పార్వతీ, పశుపతి, డానియన్, కాల్టాగిరోన్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారతీయ, విదేశీ భాషల్లో 2డీ, 3డీ ల్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Also Read : Megastar Chiranjeevi: చిరు 156 టైటిల్ రిలీజ్ ! టైటిల్ కాన్సెప్ట్ వీడియో షేర్‌ చేసిన చిత్ర యూనిట్ !

Thangalaanvikram
Comments (0)
Add Comment