Vikram: అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కమల్ హాసన్ ‘విక్రమ్‌’ !

అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కమల్ హాసన్ ‘విక్రమ్‌’ !

Vikram: కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా ‘విక్రమ్‌’. కమల్ హాసన్, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌ పై క‌మ‌ల్ హాస‌న్, ఆర్.మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమా 2022లో విడుదలై పాన్ ఇండియా హిట్ గా నిలిచి… కమల్ హాసన్ రికార్డులను తిరగ రాసింది. దీనికి సీక్వెల్ గా లోకేష్ కనగరాజ్ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలను ఒకదానితో ఇంకొకటి అనుసంధానం చేస్తూ సీక్వెల్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఖైదీ 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ తరువాత దీని సీక్వెల్ చేయనున్నట్లు సమాచారం.

Vikram Movie Updates

అయితే 2022లో విడుదలై పాన్ ఇండియా హిట్ సాధించిన ‘విక్రమ్‌(Vikram)’ సినిమా ‘ఒసాకా తమిళ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ లో తన సత్తా చాటింది. ఈ వేడుకల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఆదివారం ‘ఒసాకా తమిళ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ సంస్థ వెల్లడించిన జాబితాలో ‘విక్రమ్‌’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అందులో ప్రధాన పాత్ర పోషించిన కమల్‌ హాసన్‌ ఉత్తమ నటుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్‌, ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్స్‌ గా రత్నకుమార్‌, లోకేశ్‌ కనగరాజు, ఉత్తమ సపోర్టింగ్‌ యాక్టర్‌ గా ఫహాద్‌ ఫాజిల్‌, ఉత్తమ విలన్‌ గా విజయ్‌ సేతుపతి ను ఎంపిక చేసింది. జపాన్‌ దేశంలోని ఒసాకా నగరం ఈ అవార్డుల వేడుకకు వేదికగా మారింది. ఈ ఈవెంట్‌ కోలీవుడ్‌, జపాన్‌ చిత్ర పరిశ్రమల మధ్య వారధిగా నిలుస్తోంది.

Also Read : Janhvi Kapoor: ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి’ కోసం జాన్వీ కపూర్ హార్డ్ వర్క్ !

Kamal HaasanLokesh Kanagarajvikram
Comments (0)
Add Comment