Jana Nayagan : తమిళ సినీ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ కలిగిన నటుడు దళపతి విజయ్. తన సినీ కెరీర్ లో ఎవరూ ఊహించని రీతిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక చివరి చిత్రం ఇదేనంటూ ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు విస్తు పోయారు. కోలీవుడ్ లో రజనీకాంత్ తర్వాత ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన యాక్టర్ విజయ్. తను ఎక్కువగా మాట్లాడడు. కానీ ఈ మధ్యన పాలిటిక్స్ గురించి, తన ప్రాంతంపై ఫోకస్ పెట్టాడు. ఇదే సమయంలో చివరి చిత్రం షూటింగ్ పూర్తయ్యేందుకు ఎక్కువగా దృష్టి సారించాడు.
Hero Vijay-Jana Nayagan Movie Release Updates
జన నాయకుడు తన సినీ జీవితంలో అత్యంత మరిచి పోలేని చిత్రం అవుతుందని ఇప్పటికే ప్రకటించాడు. దీంతో తన అనౌన్స్ మెంట్ తో ఒక్కసారిగా ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగేలా చేశాయి. ఎవరూ ఊహించని రీతిలో మార్కెట్ ఏర్పడింది. ఇదిలా ఉండగా తాజాగా మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. జన నాయకుడు(Jana Nayagan) రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి చెందిన పోస్టర్స్, టీజర్ కు భారీ ఆదరణ పెరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ జన నాయకుడు సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో జన నాయగన్(Jana Nayagan) గా వస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో కీలక పాత్రలో నటిస్తోంది పూజా హెగ్డే. బాబీ డియోల్ , మమితా బైజూ, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ లాంటి స్టార్స్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది శరవేగంగా. ఇందు కోసం స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించే పనిలో దర్శకుడు ఉన్నట్లు సమాచారం. మొత్తంగా విజయ్ జన నాయకుడు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
Also Read : Neha Kakkar Crying Sensational :సింగర్ పై ఆగ్రహం నేహా కక్కర్ భావోద్వేగం