Vijay Varma Shocking :సంబంధాలు ఐస్ క్రీం లాంటివి

తమన్నా విడిపోవడంపై విజయ్ వర్మ

Vijay Varma : మిల్కీ బ్యూటీ నుంచి తాను విడి పోవ‌డంపై మాజీ ప్రియుడు విజ‌య్ వ‌ర్మ(Vijay Varma) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆమెతో సంబంధం అనేది ఐస్ క్రీం లాంటిదంటూ పేర్కొన్నాడు. ఈ ఇద్ద‌రూ కొంత కాలం పాటు డేటింగ్ లో ఉన్నారు. 2023లో వ‌చ్చింది లస్ట్ స్టోరీస్ – 2 . తొలిసారి తెరను పంచుకున్నారు ఈ ఇద్ద‌రు. తమ అద్భుతమైన ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకర్షించారు. ఈ సిరీస్ షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో ప‌డ్డారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య దాదాపు రెండు సంవ‌త్స‌రాలు బంధం కొన‌సాగింది. చివ‌ర‌కు ఉన్న‌ట్టుండి విడిపోతున్న‌ట్లు ఇటీవలే ప్ర‌క‌టించారు.

Vijay Varma Shocking Comments

వీరి మ‌ధ్య ఉన్న డేటింగ్ కు సంబంధించి తొలిసారిగా నోరు విప్పింది. తాజాగా విజ‌య్ వ‌ర్మ స్పందించాడు. ప్రేమ అనేది ట్రాష్ అని, ఒక ర‌కంగా చెప్పాలంటే ఐస్ క్రీం లాంటిదంటూ పేర్కొన్నాడు. మ‌రో వైపు దీనిపై స్పందించింది ల‌వ్లీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా(Tamannaah Bhatia). సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. తాను సంబంధంలో కంటే ఒంట‌రిగా ఉండటంలోనే సంతోషంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేసింది. భాగ‌స్వామిని ఎంచుకునే ముందు ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది.

దీనిపై స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు మాజీ ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌. ఒక సంబంధాన్ని ఐస్ క్రీం లాగా ఆస్వాదించాలి. అప్పుడే నిజంగా సంతోషంగా ఉండ‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు. ఈ స‌మ‌యంలో ఎదుర‌య్యే కోపం, ఆనందం, దుఖఃం, చికాకు అన్నింటినీ అంగీక‌రించి ముందుకు సాగ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌న్నాడు. ఒక‌ప్పుడు సూప‌ర్ జంట‌గా పేరు పొందిన వీరు విడి పోవ‌డం ప‌ట్ల ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు.

Also Read : TFC Shocking Comment :న‌కిలీ యూట్యూబ్ థంబ్ నెయిల్స్ పై ఫైర్

CommentsTamannaah BhatiaVijay VarmaViral
Comments (0)
Add Comment