Vijay Thalapathy: టెన్త్, ఇంటర్ టాపర్స్ కు దళపతి విజయ్‌ స్పెషల్ గిఫ్ట్స్ !

టెన్త్, ఇంటర్ టాపర్స్ కు దళపతి విజయ్‌ స్పెషల్ గిఫ్ట్స్ !

Vijay Thalapathy: కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్… సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ నేపథ్యంలోనే సినిమాల నుండి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ‘తమిళగ వెట్రి కళగం’ అనే రాజకీయ పార్టీను పెట్టినట్లు ప్రకటించి… 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న విజయ్… విద్యార్ధుల్లో ట్యాలెంట్ ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రోత్సహకాలను ప్రకటించి మరోసారి మంచి మనసు చాటుకోనున్నారు. ఇటీవల వెలువడిన టెన్త్‌, ఇంటర్‌ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బహుమతులు అందించనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ప్రతినిధులు ప్రకటించారు.

Vijay Thalapathy Gifts

గతేడాది ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న ఒక విద్యార్థినికి విజయ్‌(Vijay Thalapathy) డైమండ్‌ నెక్లెస్‌ కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు కూడా మరోసారి విద్యార్థులకు సాయం చేయనున్నారు. ఈ ఏడాదిలో టాపర్లుగా నిలిచిన వారికి సర్టిఫికెట్‌తో పాటు రివార్డులను అందజేయనున్నారు. జూన్‌ 28, జులై 3తేదీల్లో చెన్నై వేదికగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా టెన్త్‌, ఇంటర్‌ లో టాప్‌ 3లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నారు. ఇక ఇటీవలే ఈ హీరో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం విజయ్‌(Vijay Thalapathy)… వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’ వాడుతున్నారు. ఈ టెక్నాలజీతో ఆయన్ని పాతికేళ్ల కుర్రాడిలా చూపించనున్నారు. ‘అవతార్‌’, ‘అవెంజర్స్‌’ లాంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌కి పనిచేసిన సాంకేతిక నిపుణులు ‘ది గోట్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

Also Read : Mirzapur 3: ఓటీటీలోకి ‘మీర్జాపూర్‌ 3’ ! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

The Greatest of All TimeVijay Thalapathy
Comments (0)
Add Comment