The GOAT Movie : విజయ్ నటించిన ‘ది గోట్’ సినిమా నుంచి కీలక అప్డేట్

యువన్ శంకర్ రాజా ఈ పాటని బ్యూటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు...

The GOAT Movie : శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ‘ది గోట్‘ సినిమా నుంచి ఇటీవ‌ల వ‌చ్చిన ఫస్ట్ సింగిల్ విజిలేస్కో సాంగ్ సెన్సేషనల్ హిట్ అయింది.తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ నిన్ను కన్న కనులే రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజా ఈ పాటని బ్యూటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఫ్యామిలీ బాండింగ్ ని చాలా వండర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా యువన్ శంకర్ రాజా, ఎస్పీ చరణ్, చిత్ర తమ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు. ఈ సూపర్ మెలోడీ హిట్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.

The GOAT Movie Updates

విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ వాసుదేవన్, అఖిలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్ పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది.

Also Read : Kalki 2898 AD Records : బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘కల్కి’

Hero VijayThe GOATTrendingUpdatesViral
Comments (0)
Add Comment