Viduthalai 2 : ఒక ఫ్యాన్సీ రేటుకు విజయ్ సేతుపతి ‘విడుదల పార్ట్ 2’ తెలుగు రైట్స్

విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్ గా ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది...

Viduthalai 2 : జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొంది గ‌త సంవ‌త్స‌రం మార్చి 31న రిలీజై త‌మిళంతో పాటు తెలుగులోనూ సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ‘విడుదలై పార్ట్1’. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘విడుదలై’-2(Viduthalai 2)’రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్ప‌టికే చిత్రీకరణ, డ‌బ్బింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా ప్రకటించినట్టుగానే డిసెంబరు 20న విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్‌లో హీరో సూరి, లీడింగ్‌ రోల్‌ పోషించిన విజయ్‌ సేతుపతికి సంబంధించిన పాత్రలే ఈ భాగంలోనూ కీలకంగా ఉన్నాయి. రెండో భాగంగా విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi)కి సంబంధించిన సన్నివేశాలతో కిషోర్‌, మంజు వారియర్‌, కరుణాస్‌ వంటి ముఖ్య నటులకు సంబంధించిన పాత్రలున్నాయి. అయితే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఎంతోమంది నిర్మాతలు పోటీ పడగా చివ‌ర‌కు ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు ఫాన్సీ రేట్‌తో ఈ చిత్ర హ‌క్కుల‌ను దక్కించుకున్నారు.

Viduthalai 2 Telugu Rites…

ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ “విడుదల 2(Viduthalai 2) చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించ బోతున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్ గా ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది. అలాగే ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రీ మారన్, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫో టైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని అత్య ద్భుతంగా తెరకెక్కించారు.

మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్రాన్ని మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతూ, ఈ చిత్రం డెఫినెట్ గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నానని.. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామ‌న్నారు. ఇదిలాఉంటే, రెండో భాగం కోసం చిత్రీకరించిన రషెస్‌ నిడివి అధికంగా ఉండటంతో మరో భాగం (థర్డ్‌ పార్ట్‌)గా విడుదల చేయాలన్న ఆలోచనలో దర్శక నిర్మాతలున్నట్టు సమాచారం. అయితే, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్‌ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానిశ్రీ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రానికి డిఓపి వేల్ రాజ్ చేయ‌గా, ఇళయరాజా సంగీతం అందించారు.

Also Read : Aishwarya Rai : ఐశ్వర్య కొడుకునంటూ ఫోటో పట్టుకొని తిరుగుతున్న వ్యక్తి

TrendingUpdatesViduthalai-2Vijay SethupathiViral
Comments (0)
Add Comment