Vijay Sethupathi Shocking :ప్రాంతీయ భాష‌ల ప‌ట్ల వివక్ష త‌గ‌దు

పాన్ కార్డులో మార్పులు చేయండి

Vijay Sethupathi : త‌మిళ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ సేతుప‌తి(Vijay Sethupathi) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. పాన్ కార్డుకు సంబంధించి మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. ఈ విష‌యంలో మోడీ కేంద్ర స‌ర్కార్ పున‌రాలోచించాల‌ని సూచించారు. పాన్ కార్డు స‌మాచారాన్ని త‌మ రాష్ట్రానికి రాజ భాష త‌మిళంలో ఉండాల‌ని కోరాడు. భాష అనేది ప్ర‌జ‌లకు అత్యంత ముఖ్య‌మైన‌ద‌ని, వారికి త‌మ భాష‌లో లేక పోవ‌డం వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వాపోయాడు.

Vijay Sethupathi Shocking Comments

భాష అమ‌లుపై , చేర్పుల‌పై ఎందుకు వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తున్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు. ఈ దేశంలో ఎన్నో కులాలు, మతాలు, జాతుల‌కు చెందిన వారున్నారని, వారి అభిప్రాయాల‌ను, మ‌నోభావాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

స‌ర్వ మ‌త స‌హ‌నం క‌లిగి ఉండాల‌ని రాజ్యాంగం బోధిస్తుంద‌ని, అంద‌రికీ స‌మాన ప్రాధాన్య‌త‌, భాష‌ల అమ‌లు క‌చ్చితంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంపై కేంద్రం మాన‌వ‌తా దృక్ఫ‌థంతో వ్య‌హ‌రించాల‌ని కోరారు విజ‌య్ సేతుప‌తి. ఇదిలా ఉండ‌గా పాన్ కార్డు విష‌యంలో త‌మిళ న‌టుడు చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఇటు సినీ రంగంలో అటు రంగంలో ఒక్క కుదుపు కుదిపాయి.

విచిత్రం ఏమిటంటే పాన్ కార్డులో హిందీ, ఇంగ్లీష్ మాత్ర‌మే ఉన్నాయ‌ని, ప్రాంతీయ భాష‌ల‌ను కూడా చేర్చాల‌ని స్ప‌ష్టం చేశారు. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు త‌మ వివ‌రాలు తెలుసుకునేందుకు వీల‌వ‌వుతుంద‌న్నారు.

Also Read : Beauty Mangli : జ‌న్మంటూ ఉంటే సింగ‌ర్ గానే పుట్టాలి

CommentsVijay SethupathiViral
Comments (0)
Add Comment