Vijay Sethupathi: విభిన్న పాత్రలు, వినూత్న కథలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి… ఆస్కార్ నామినేషన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రాలకు గుర్తింపు రావాలన్న నటుడు విజయ్ సేతుపతి… ‘‘ఆస్కార్ నామినేషన్లకు ఎంపికైన చిత్రాల లిస్ట్‌లో ‘సూపర్‌డీలక్స్’ లేనందుకు నాతో పాటు చిత్రబృందమంతా బాధపడింది అన్నారు. ఆ క్షణం నా గుండె పగిలినంత పనైంది. నేను ఆ సినిమాలో ఉండడం వల్ల అది ఆస్కార్‌కు వెళ్లాలని నేను అనుకోలేదు… నేను అందులో నటించకపోయినా ఆ సినిమా నామినేట్ అవ్వాలని కోరుకునే వాడిని. ఎందుకంటే మంచి చిత్రానికి ఆదరణ లభించాలనేది నా ఉద్దేశం. మధ్యలో ఏం జరిగిందనే దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు’’ అని ఆయన అన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో కలిసి విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన తాజా సినిమా ‘మెరీ క్రిస్మస్’. ఈ నెల 12న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆస్కార్ నామినేషన్ల గురించి స్పందించారు.
Vijay Sethupathi Viral
విజయ్ సేతుపతి, సమంత, ఫహాద్ ఫాజిల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘సూపర్‌డీలక్స్’. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరచిన సంగతి తెలిసిందే. హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా ఏ ఒక్క కేటగిరీలోనూ ఆస్కార్ కు నామినేట్ అవలేదు.
Also Read : Darshan Thoogudeepa: స్టార్ హీరోపై కేసు నమోదు చేసిన పోలీసులు !