Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా సినిమా ‘మహారాజ’. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా నిథిలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, అభిరామి, మమత.. కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. దీనితో ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర యూనిట్ షురూ చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Vijay Sethupathi Comment
‘మహారాజ’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) మాట్లాడుతూ… ‘‘నేను నటించిన ‘డీఎస్పీ’ సినిమాలో కృతిని హీరోయిన్ గా తీసుకుంటే చేయలేనని చెప్పా. దానికి కారణం ‘ఉప్పెన’లో ఆమెకు తండ్రిగా నటించాను. అది మంచి విజయాన్ని సాధించింది. కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయలేను. అందుకే వద్దు అని చిత్రబృందంకు చెప్పాను. ‘ఉప్పెన’లో కొన్ని క్లైమాక్స్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు కృతి కంగారు పడింది. ‘నాకు నీ వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. నన్ను నీ తండ్రిగా భావించు’ అని ధైర్యం చెప్పాను. కూతురిగా భావించిన ఆమెకు జోడీగా నటించడం నా వల్ల కాదు’’ విజయ్ సేతుపతి వివరించారు. గతంలోనూ ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ‘ఉప్పెన’ తర్వాత రెండు సినిమాల్లో హీరోయిన్‌గా కృతిని ఎంపిక చేయగా.. ఆయన తిరస్కరించారు.
Also Read : Konidela Nagababu: టీటీడీ చైర్మెన్ గా నాగబాబుకి ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త !