Vijay Sethupathi: పిజ్జా సినిమాతో చిన్న హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి… ఉప్పెన సినిమాతో తిరుగులేని విలన్ గా తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న నటుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. మాస్టర్, విక్రమ్, జవాన్ వంటి స్టార్ హీరోల డబ్బింగ్ సినిమాలతో పాన్ ఇండియా క్రేజీ విలన్ గా గుర్తింపు పొందారు విజయ్ సేతుపతి. సినిమాల్లో ఎలాగున్నా బయట మాత్రం విజయ్ సేతుపతి చాలా నిడారంబరంగా కనిపిస్తారు. పెద్దగా మేకప్ లేకుండా చాలా సింపుల్ గా ఉండే షర్టులు, ఫార్మల్స్ లో ఎక్కువగా కనిపిస్తారు. దీనితో విజయ్ సేతుపతి అంటే సింప్లిసిటీకు కేరాఫ్ అని అందరూ అనుకుంటారు.
Vijay Sethupathi Comment
‘జవాన్’ తర్వాత విజయ్ సేతుపతి బాలీవుడ్లో నటిస్తోన్న చిత్రం ‘మెరీ క్రిస్మస్’. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన కత్రినా కైఫ్ నటించగా… ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ముంబైలో నిర్వహించిన ‘మెరీ క్రిస్మస్’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న విజయ్ సేతుపతి… తనకు అభిమానులు ఇచ్చే సింప్లిసిటీ లేబుల్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. తన సింప్లిసిటీపై విజయ్ సేతుపతి(Vijay Sethupathi) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ముంబైలో నిర్వహించిన ‘మెరీ క్రిస్మస్’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న విజయ్ సేతుపతి మాట్లాడుతూ… సింప్లిసిటీ లేబుల్ తనకు ఇవ్వొద్దని అన్నారు. తాను ధరించే దుస్తులు ఖరీదైనవని ఆయన స్పష్టం చేసారు. ‘‘నేను నిరాడంబరంగా ఉంటానని ప్రేక్షకులు అనుకుంటారు. అది నిజం కాదు. సౌకర్యవంతంగా అనిపించే దుస్తులను మాత్రమే ధరిస్తుంటా. ఖరీదైనవే వేసుకుంటా. కాబట్టి, సింప్లిసిటీ అనేది నాకు వర్తించదు. దయచేసి ఆ లేబుల్ నాకు ఇవ్వొద్దు’’ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసారు. దీనితో విజయ్ సేతుపతి వాఖ్యలను నెట్టింట వైరల్ చేస్తున్నారు అతని అభిమానులు.
Also Read : Curry and Cyanide: ఓటీటీలో రికార్డు సృష్టిస్తున్న ‘కర్రీ అండ్ సైనైడ్’