Hero Vijay Sethupathi : క‌థ న‌చ్చినందుకే పూరీ జ‌గ‌న్నాథ్ తో జ‌త‌క‌ట్టా

ఫెయిల్యూర్స్ గురించి ప‌ట్టించుకోను

Vijay Sethupathi : సినీ రంగంలో స‌క్సెస్ ఉంటేనే ప‌ల‌క‌రిస్తారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ పేర్కొన్నాడు. త‌ను తీసిన సినిమాలు ఆశించిన మేర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక పోయాయి. తాను ఫోన్ చేసినా, క‌థ‌లు రెడీగా ఉన్నాయ‌ని చెప్పినా ఏ ఒక్క‌రూ స్పందించ‌డం లేదంటూ వాపోయారు. ఇది ప‌క్క‌న పెడితే త‌ను తీసిన ఇస్మార్ట్ శంక‌ర్ -2 సీక్వెల్ మూవీ ఎత్తి పోయింది. విజ‌య్ దేవ‌ర‌కొండతో తీసిన లైగ‌ర్ పూర్తిగా డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ స‌మ‌యంలో పాన్ ఇండియా స్థాయిలో అద్భుత‌మైన న‌టుడిగా గుర్తింపు పొందిన త‌మిళ సినీ రంగానికి చెందిన విజ‌య్ సేతుప‌తి(Vijay Sethupathi) పూరీతో మూవీ చేసేందుకు ఓకే చెప్ప‌డం విస్తు పోయేలా చేసింది.

Vijay Sethupathi Comment

ఈ సంద‌ర్బంగా చిట్ చాట్ లో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. తాను గ‌తం గురించి ఆలోచించ‌న‌ని, డైరెక్ట‌ర్ చేతిలో ఎన్ని క‌థ‌లు ఉన్నాయోన‌ని చూస్తాన‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో త‌న ఫెయిల్యూర్స్ గురించి అస్స‌లు ప‌ట్టించుకోనంటూ స్ప‌ష్టం చేశాడు విజ‌య్ సేతుప‌తి. నాకు క‌థ ముఖ్యం. నా పాత్ర ఏ మేర‌కు ప్రేక్ష‌కుల మ‌న‌సు ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని ఆలోచిస్తానంతేన‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ సినీ వ‌ర్గాల‌ను ఆలోచింప చేసేలా చేసింది.

స‌క్సెస్ వ‌చ్చిన‌ప్పుడు ప‌ల‌క‌రించిన వారు..ఫెయిల్యూర్ ఎదురైన‌ప్పుడు వ‌దిలి వేసే ర‌కం తాను కాద‌న్నాడు విజ‌య్ సేతుప‌తి. పూరీ జ‌గన్నాథ్ గురించి పూర్తిగా తెలుసు. త‌ను ద‌మ్మున్నోడు. తీసిన ప్ర‌తి మూవీ హిట్ అవ్వాల‌న్న రూల్ ఏమీ లేద‌న్నాడు. క‌థ బాగుంటే చాలు ఒక్కోసారి స‌క్సెస్ కావ‌చ్చు లేదా కాక పోవ‌చ్చు. క‌థ బాగుంది క‌నుక‌నే తాను ఒప్పుకున్నాన‌ని, తొలిసారిగా ట‌బుతో పాటు రాధికా ఆప్టేతో న‌టిస్తున్నాన‌ని చెప్పాడు.

Also Read : Thalaiva Coolie Sensational :త‌లైవా కూలీలో క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర

CinemaCommentspuri jagannadhVijay SethupathiViral
Comments (0)
Add Comment