Vijay Sethupathi : తమిళ సినీ రంగంలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు విజయ్ సేతుపతి. నటుడిగానే కాదు వ్యక్తిగా కూడా చాలా కూల్ గా ఉంటాడు. ఆ మధ్యన విలనిజం పండిస్తూ తెలుగు వారి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తీసిన ఉప్పెనలో తన సత్తా ఏమిటో చాటాడు. ఆ తర్వాత స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ తీసిన జవాన్ చిత్రంలో తానేమిటో నిరూపించాడు. ఇందులో విలన్ గా షారుక్ కాన్ విస్తు పోయేలా నటించాడు. ఆ తర్వాత బాద్ షా ఏకంగా అందరి ముందు స్టేజీ పైనే విజయ్ సేతుపతి(Vijay Sethupathi) వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాడు.
Vijay Sethupathi as a Spirit movie Vilan
తనను సర్ అని సంబోదించాడు. అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ప్యాన్ ఇండియా డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి ఇప్పుడు నేషనల్ వైడ్ గా సంచలనంగా మారాడు. తను ఏది చేసినా ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మనోడు స్టార్టింగ్ లో సినిమాలు తీసేందుకు నానా తంటాలు పడ్డాడు. తన ఆస్తులు అమ్మేసి అర్జున్ రెడ్డి తీశాడు . ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనినే హిందీలో షాహిద్ కపూర్ తో తీశాడు. అది కూడా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో బాలీవుడ్ స్టార్ హీరో రణ దీర్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో కలిసి యానిమల్ తీశాడు.
ఇది రికార్డుల మోత మోగించింది. ఏకంగా రూ. 1000 కోట్లు కలెక్షన్స్ చేసింది. ఇప్పుడు మరో ప్యాన్ ఇండియా మూవీ తీస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే స్టార్ హీరో డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్(Spirit) పేరుతో మూవీకి శ్రీకారం చుట్టాడు. ఇందులో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇంకా షూటింగ్ ప్రారంభం కాకుండానే భారీ అంచనాలు పెంచేలా చేసింది. టేకింగ్, మేకింగ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న దర్శకుడు వంగా నుంచి ఈ మూవీ ఎలా వస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.
Also Read : Court Movie Sensational :కలెక్షన్లలో హాఫ్ సెంచరీ దాటేసిన కోర్ట్