Vijay Rashmika : ఫిబ్రవరిలో విజయ్,రష్మికల నిశ్చితార్థమన్న మాట నిజమేనా..?

మళ్ళీ వైరల్ అవుతున్న పెళ్లి వార్తలు

Vijay Rashmika : టాలీవుడ్ హ్యాండ్సమ్ మ్యాన్ విజయ్ దేవరకొండ, నేషనల్ ఫేవరెట్ రష్మిక మళ్లీ పెళ్లి అన్న వార్త వైరల్ అవుతుంది.వీళ్లు ఇద్దరు పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు, కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చారు. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు అని హెచ్చరించారు.

Vijay Rashmika Marriage Viral

‘గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్స్’లో విజయ్(Vijay Devarakonda), రష్మిక జంటగా కనిపించారు. వీరిద్దరూ నటించిన ఈ రెండు సినిమాల్లో రష్మిక, విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ జంట చాలా మందికి ఫేవరెట్ గా మారింది. అదే సమయంలో విజయ్, రష్మిక ప్రేమలో పడ్డారని పుకార్లు వచ్చాయి. తరచూ పార్టీలు, ఈవెంట్‌లు, డిన్నర్‌లకు కలిసి వెళ్లే వారిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, విజయ్ మరియు రష్మిక కొన్నిసార్లు డేటింగ్ నివేదికలను ఖండించారు. తాము మంచి స్నేహితులమని చాలా సందర్భాల్లో వెల్లడించారు. అయితే, ఈవార్తలు ఆగడం లేదు. తాజాగా విజయ్, రష్మిక నిశ్చితార్థం, పెళ్లి వార్త మళ్లీ వైరల్‌గా మారింది. అయితే యధావిధిగా విజయ్ టీమ్ వాటిని కండించింది.

Also Read : Devara Glimpse : ఇప్పుడే రిలీజ్ అయిన ‘దేవర’ గ్లింప్స్… భారీగా పరిగెడుతున్న వ్యూస్

BreakingCommentsRashmika MandannaTrendingvijay devarakondaViral
Comments (0)
Add Comment