Vijay: విజయ్ ‘గోట్‌’ సినిమాకు 6 వేల థియేటర్లు !

విజయ్ ‘గోట్‌’ సినిమాకు 6 వేల థియేటర్లు !

Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గోట్‌’(ది గ్రేటెస్ట్‌ ఆఫ్ ఆల్‌ టైమ్‌). ప్రముఖ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష ఓ పాటతో పాటు కీలక పాత్రలో నటిస్తోంది. స్నేహ, లైలా, ప్రశాంత్‌, మోహన్‌, జయరాం, అజ్మల్‌, అమీర్‌, యోగిబాబు, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కల్పాత్తి ఎస్‌ అఘోరం, కల్పాత్తి ఎస్‌ గణేష్‌, కల్పాత్తి ఎస్‌. సురేష్‌ నిర్మించిన ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌ కథాచిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని, సిద్ధార్థ నూని ఛాయాగ్రహణం అందించారు.

Vijay Movie Updates

ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా… సెప్టెంబర్‌ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6000కు పైగా థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న విజయ్(Vijay)… రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడులను అత్యంత భారీగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఒకవైపు విజయ్ హీరోయిజాన్ని, బాక్సాఫీసు స్టామినాను ఎలివేట్ చేయడంతో పాటు రాజకీయంగా కూడా మైలేజీగా ఉపయోగించుకోవడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 6000కు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అర్చన మాట్లాడుతూ ఇది ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన 25వ చిత్రం. అదేవిధంగా విజయ్‌(Vijay) హీరోగా ఇంతకు ముందు బిగిల్‌ చిత్రాన్ని చేసామని, తాజాగా గోట్‌ ఆయనతో చేసిన రెండవ చిత్రమని చెప్పారు. లేకపోతే వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందించిన తొలిచిత్రం. ఇది సాంకేతిక పరంగా చాలా బలమైన చిత్రం. గోట్‌ చిత్రం ఇప్పటికే టేబుల్‌ ప్రాఫిట్‌ నిచ్చిందని చెప్పారు.

దర్శకుడు వెంకట ప్రభు మాట్లాడుతూ చిత్ర షూటింగ్‌ ను ఇస్తాంబుల్‌ లో నిర్వహించాలని వెళ్లామని అయితే అక్కడ షూటింగ్‌ సాధ్యం కాకపోవడంతో రష్యాలో కొంత భాగం చిత్రీకరించినట్లు చెప్పారు. అదేవిధంగా గోట్‌ చిత్ర షూటింగ్‌ అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ లోనే ప్రారంభించినట్లు చెప్పారు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు.

చిత్రంలోని వీఎఫ్‌ ఎక్స్‌ సన్నివేశాల కోసం ప్రపంచంలోనే పేరుగాంచిన లోలా సంస్థతో ఒప్పందం చేసుకుని రూపొందించినట్లు చెప్పారు. ఇది అన్ని వర్గాలను అందించే కమర్షియల్‌ అంశాలతో కూడిన పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిపారు. అయితే నటుడు విజయ్‌ రాజకీయాలకు గోట్‌ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Also Read : Rashmika Mandanna : ఒకేరోజు రెండు సినిమాలతో రానున్న నేషనల్ క్రష్

Meenakshi ChaudharyThalapathy VijayThe GOATVenkat Prabhu
Comments (0)
Add Comment