Vijay Deverakonda : తన డేటింగ్ కథనాలపై స్పందించిన రౌడీ బాయ్ విజయ్

విజయ్ ఆ ప్రశ్నలకి ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ....

Vijay Deverakonda : రౌడీ బాయ్ ‘విజయ్ దేవరకొండ’ ఎట్టకేలకు రష్మికతో తన బంధాన్ని రివీల్ చేశారు. ఇటీవల రిలీజైన ‘సాహిబా’ సాంగ్ ప్రమోషన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ కంపోజర్ జస్లీన్ రాయల్ తో పాటు హీరోయిన్ రాధికా మదన్ పాల్గొని విజయ్ లవ్ లైఫ్ సీక్రెట్స్ ని బయటపెట్టారు. దీంతో ఎట్టకేలకు రష్మిక, విజయ్ సంబంధం ఏంటో తెలిసిపోయింది అంటున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ జస్లీన్ రాయల్ ‘హీరీయే హీరీయే’ సాంగ్ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రాధికా మదన్ కాంబినేషన్ లో ‘సాహిబా’ సాంగ్ రూపొందిచిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ మంచి వ్యూస్ సంపాందించుకొని యూట్యూబ్ లో దూసుకుపోతున్న నేపథ్యంలో టీమ్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే టీమ్ విజయ్ ని లవ్ రిలేషన్షిప్ గురించి అడిగారు.

Vijay Deverakonda Comments..

విజయ్ ఆ ప్రశ్నలకి ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. “నేను నా కో స్టార్ ఒకరితో డేటింగ్ లో ఉన్నాను. నా వయసు 35, నేను ఒంటరిగా ఉంటానని మీరు ఎలా భావించారు. రొమాంటిక్ రిలేషన్షిప్ లోకి వెళ్లేముందే నేను ఆ వ్యక్తులతో క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేస్తాను. నేను ప్రత్యేకించి డేట్‌లకు వెళ్ళాను, ఎవరితోనైతే చాలా కాలం నుండి ఫ్రెండ్షిప్ ఉంటాదో వాళ్ళతోనే బయటకెళ్తాను. నాకు షరతులు లేని ప్రేమ కావాలి. నాకు ప్రేమించడం తెలుసు, ప్రేమను తీసుకోవడం తెలుసు” అన్నారు. అయితే ఇప్పటికే రశ్మికకి, విజయ్ కి మధ్యలో మంచి స్నేహం ఉంది. దీపావళి కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో విజయ్, రష్మికతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఫిక్స్ చేసేస్తున్నారు నెటిజన్లు.

ఇకయంగ్ బాయ్స్ కి విజయ్ అడ్వైజ్ ఇస్తూ.. “ప్రేమ అనేది తప్పకుండా పుడుతుంది అబ్బాయిలు. మీరు ఇంకా యంగ్‌గానే ఉన్నారు కాబట్టి కాస్త టైమ్ తీసుకోండి. అన్నిటికంటే ముందుగా కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలి. లవ్ అనేది చెడ్డ విషయం కాదు, దానికి మనం కాస్త టైమ్ ఇవ్వాలి. లవ్ విషయంలో 30 దాటిన పురుషులు 20 ఏండ్ల మధ్య ఉన్నవారికంటే బెటర్‌గా ఆలోచిస్తారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉన్నప్పుడు మనం అస్థిరంగా ఉంటాం, ఏది డిసైడ్ చేసుకోలేం. సమయం వచ్చినప్పుడు అవే జరుగుతాయి. ఏది ఫోర్స్‌గా చేయకండి” అంటూ ఆయన ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వీపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Also Read : Prabhas-Sharmila : ప్రభాస్ తో తనకున్న రిలేషన్ పై షర్మిల కీలక వ్యాఖ్యలు

CommentsRashmika MandannaTrendingUpdatesvijay devarakondaViral
Comments (0)
Add Comment