Vijay Deverakonda : అవును.. కొద్దిరోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు సంబంధించి చక్కర్లు కొడుతున్న ఓ వార్తలో నిజం ఉన్నట్లు అఫీషియల్ గా ప్రకటించేశారు. దీంతో విజయ్ దేవరకొండ(Vijay deverakonda), రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ‘పుష్ప 2’ తర్వాత రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నేషనల్ అవార్డు విన్నర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్నా(Rashmika Mandanna) లీడ్ రోల్‌లో నటిస్తున్న వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.ఈ సినిమా టీజర్ ను డిసెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ టీజర్ లో రష్మిక మందన్న పాత్ర నేపధ్యాన్నికి విజయ్ దేవరకొండ వాయిస్ అందిస్తారు అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. నిజంగానే ఆ వార్తల్లో నిజమున్నట్లు మేకర్స్ అఫీషియల్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
Vijay Deverakonda Comments..
ఇక రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. కలిసి టూర్స్‌కి వెళ్లడం ఆ ఫొటోలు వైరల్ కావడం ఈ రూమర్స్‌కు కారణం. అంతే కాదు.. రెండేళ్లగా రష్మిక దీపావళి ఫెస్టివల్‌ను దేవరకొండ కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవడం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం అందుకు ఓ కారణం. తాజాగా మరోసారి రష్మిక, దేవరకొండ ఫ్యామిలీ వార్తలో నిలిచారు. తాజాగా దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక ఆమె కథానాయికగా నటించిన పుష్ప-2 సినిమాను వీక్షించింది. హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో విజయ్ దేవరకొండ తల్లి, సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఈ సినిమాను చూశారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక బాండింగ్ మరింత బలపడినట్లు కనిపిస్తోంది. అయితే విజయ్ తల్లి, రష్మిక సినిమాకు కలిసే వెళ్లారా? లేక అనుకోకుండా థియేటర్‌లో కలిశారా అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యన దేవరకొండ ఫ్యామిలీతో దీపావళి సెలబ్రేషన్స్, ఇప్పుడు విజయ్ తల్లి మాధవితో కలిసి సినిమాకు వెళ్లడం చూస్తే.. విజయ్, రష్మికల పెళ్లి వార్తలు వాస్తవమే అనిపిస్తోంది. ఇదే, మాట నెటిజన్లు కూడా చెబుతున్నారు. ఏం జరుగుతుందనేది చూడాలి.
Also Read : Mohan Babu-Manoj : మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకుల మధ్య యుద్ధ భేరి