Vijay Deverakonda:శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన తాజా సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు విజయ్ దేవరకొండతో మరో చిత్రాన్ని నిర్మించనున్నారు.
Vijay Deverakonda:
‘రాజావారు రాణివారు’ సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు రవికిరణ్ కోలా ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకొనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు(మే 9)న వెల్లడిస్తారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై రూపుదిద్దుకొనే 59వ చిత్రం ఇది కావడం గమనార్హం.
Also Read :-Kantara Chapter 1: త్వరలో కుందాపురానికి ‘కాంతారా: చాప్టర్-1’ !