Vijay Deverakonda : యూపీలోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభ మేళా ఆధ్యాత్మిక మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 41 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు, సెలిబ్రిటీలు క్యూ కట్టారు. ప్రముఖ నటి జయప్రద, ప్రియాంక జైన్, కబీర్ ఖాన్ తదితరులు ఇప్పటికే గంగమ్మ సన్నిధిలో స్నానం చేశారు. ఈ సందర్బంగా పవిత్ర స్నానం చేయడం అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు.
Vijay Deverakonda Visit..
తాజాగా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు విజయ దేవరకొండ(Vijay Deverakonda) తన తల్లి మాధవితో కలిసి ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నాడు. పవిత్ర స్నానం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
విజయ దేవరకొండ మెడలో రుద్రాక్షమాల ధరించి ఉండడం మరింత ఆసక్తిని రేపింది. ప్రస్తుతం తను ఓ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇటీవలే కేజీఎఫ్ మూవీ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా తళుక్కున మెరిసింది. తను కూడా పవిత్ర స్నానం చేసింది. తండ్రితో కలిసి స్నానం చేయడం మరిచి పోలేని అనుభూతిని మిగిల్చిందని పేర్కొంది.
Also Read : Pushpa 2 Success -Megastar :పుష్ప2 బిగ్ సక్సెస్ మెగాస్టార్ కంగ్రాట్స్