Hero Vijay Deverakonda :జోరు పెంచిన విజ‌య్ దేవ‌ర‌కొండ

మే 30న విడుద‌ల కానున్న కింగ్‌డమ్

Vijay Deverakonda : యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ దూకుడు పెంచాడు. గౌత‌మ్ తిన్న‌సూరి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న కింగ్ డ‌మ్ షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. రిలీజ్ చేసిన టీజ‌ర్ కెవ్వు కేక అనిపించేలా చేసింది. అంచ‌నాలు పెరిగాయి ఈ మూవీపై. ఇటీవ‌లే శ్రీ‌లంకకు వెళ్లి వ‌చ్చాడు. కొత్త కారు కూడా కొనుగోలు చేశాడు. దానిలోనే కింగ్ డ‌మ్ మూవీ ప్ర‌మోష‌న్స్ చేసేందుకు ప్లాన్ చేశాడు. అనుకోకుండా ఎయిర్ పోర్ట్ వ‌ద్ద ద‌ర్శ‌నం ఇచ్చాడు. ఇదే స‌మ‌యంలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాతో డేటింగ్ చేస్తున్న‌ట్లు జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. దీనిని ఇద్ద‌రూ ఖండించ లేదు..అవున‌ని చెప్ప‌లేదు.

Vijay Deverakonda Speed

ఇటీవ‌లే త‌న పుట్టిన రోజు జ‌రుపుకుంది ర‌ష్మిక మంద‌న్నా. ప్రియుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌(Vijay Deverakonda)తో క‌లిసి. ఇక కింగ్ డ‌మ్ లో బాలీవుడ్ బ్యూటీ భాగ్య‌శ్రీ భోర్సే కీ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా విడుద‌ల తేదీ గురించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు మూవీ మేక‌ర్స్. మే30న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో క్యాంపెయిన్ పై ఫోక‌స్ పెట్టారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మార‌నున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ మూవీ ట్రైల‌ర్ కు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్.

త‌దుప‌రి చిత్రంపై కూడా ఫోక‌స్ పెట్టారు రౌడీ బాయ్. కింగ్ డ‌మ్ లో మాస్ అవ‌తార్ ను పోషించాడు. మేకింగ్, టేకింగ్ ప‌ట్ల మంచి మార్కులే ప‌డ్డాయి. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సార‌థ్యంలో త్వ‌ర‌లోనే న్యూ మూవీ ప్ర‌క‌టించాడు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు మ‌రో ల‌వ్లీ బ్యూటీ న‌టించ‌నుంది. చిత్రం టైటిల్ ను కూడా వెల్ల‌డించారు మూవీ మేక‌ర్స్. దానికి రౌడీ జ‌నార్ద‌న్ అని టైటిల్ ఖ‌రారు చేశారు.

Also Read : Vinci Aloshious Shocking Comment :డ్ర‌గ్స్ తీసుకునే హీరోల‌తో న‌టించ‌ను

MoviesUpdatesVijay DeverakondaViral
Comments (0)
Add Comment