Vijay Devarakonda: ప్రభాస్‌ సినిమాలో విజయ్‌ దేవరకొండ ?

ప్రభాస్‌ సినిమాలో విజయ్‌ దేవరకొండ ?

Vijay Devarakonda: ‘సలార్‌’ బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… వరుసగా మూడు సినిమాలో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమౌతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898ఎ.డి’, మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్: పార్ట్ 2’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. వీటిలో మొదటిగా ‘కల్కి 2898ఎ.డి’ని పూర్తి చేసి మే 9న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమౌతున్నారు. ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబోలో ప్రాజెక్టు -కె వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ‘కల్కి 2898ఎ.డి’ ను అతి భారీ బడ్జెట్ తో పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిస్తన్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ డ్రీమ్ ప్రాజెక్టుగా, వైజయంతీ మూవీస్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్‌హాసన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీలతో పాటు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Vijay Devarakonda – ప్రభాస్ ‘కల్కి 2898ఎ.డి’లో విజయ్ దేవరకొండ ?

అయితే ఇప్పుడు ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) కూడా భాగమైనట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898ఎ.డి’ లో విజయ్ దేవరకొండ… అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అంతేకాదు ఇప్పటికే విజయ్ షూటింగ్ లో పాల్గొన్నట్లు టాలీవుడ్ టాక్. విజయ్‌ దేవరకొండ గతంలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించారు. దీనితో ‘కల్కి 2898ఎ.డి’ లో కూడా విజయ్ దేవరకొండను… నాగ్ అశ్విన్ తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ‘కల్కి 2898ఎ.డి’ సినిమాను ఎపిక్ మైథలాజికల్- సైన్స్ ఫిక్షన్ డిప్టోపియన్ గా సుమారు రూ. 600 కోట్లతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా… సినిమాటోగ్రఫర్ గా డ్జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్… ప్రొడక్షన్ డిజైన్ గా నితిన్ జిహాని చౌదరి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఫ్యూచరిస్టిక్ సెట్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Also Read : Court Notices to Animal Movie: ఓటీటీకి సిద్ధమౌతున్న ‘యానిమల్‌’ ! ఇంతలోనే కోర్టు అడ్డంకులు ?

Prabhasvijay devarakonda
Comments (0)
Add Comment