Kingdom : టాలీవుడ్ రౌడీ బాయ్ గా పేరొందిన విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం కింగ్ డమ్(Kingdom) మూవీకి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మూవీ మేకర్స్. గౌతమ్ తిన్నసూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కీ రోల్ పోషిస్తోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. తనను హరీశ్ శంకర్ పరిచయం చేశాడు. మాస్ మహారాజా తో తీసిన మిస్టర్ బచ్చన్ లో నటించింది. ఆ మూవీ ఆశించిన మేర ఆడలేక పోయినా తనకు వరుసగా సినిమాలలో నటించే ఛాన్స్ వచ్చింది.
Hero Vijay Deverakonda -Kingdom Release Updates
కింగ్ డమ్ (Kingdom)మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని దర్శకుడు వెల్లడించారు. అయితే సినిమా ఇప్పటికే ప్రకటించినట్టుగా రిలీజ్ కాదంటూ జోరుగా ప్రచారం జరగడం పట్ల స్పందించారు. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. కింగ్ డమ్ ఇప్పటికే వెల్లడించినట్లుగానే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. వచ్చే నెల మే 30న పక్కాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుందని స్పష్టం చేశారు.
ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 50 రోజుల సమయం మిగిలి ఉందన్నారు గౌతమ్ తిన్నసూరి. సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఇక సినీ కెరీర్ పరంగా చూస్తే విజయ్ దేవరకొండకు కింగ్ డమ్ 12వ చిత్రం కావడం విశేషం. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన చిత్రం జెర్సీ. దీనికి దర్శకత్వం వహించాడు తిన్నసూరి. ఇక రౌడీ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ , ఫార్చ్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు.
Also Read : Director Rajamouli Happy :ఆస్కార్ అకాడెమీ నిర్ణయం జక్కన్న సంతోషం