Vijay Devarakonda : కోటి రూపాయ‌ల విరాళం – విజ‌య్

ఒక్కో ఫ్యామిలీకి రూ. ల‌క్ష

Vijay Devarakonda : న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాను, స‌మ‌త క‌లిసి న‌టించిన ఖుషి మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. రూ. 100 కోట్ల వైపు ప‌రుగులు తీస్తోంది. దీంతో చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ హైద‌రాబాద్ లో ఖుషీ సెలబ్రేష‌న్స్ ఘ‌నంగా నిర్వ‌హించారు. ఫ్యాన్స్ భారీ ఎత్తున హాజ‌ర‌య్యారు.

Vijay Devarakonda Comments Viral

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు , ద‌ర్శ‌కుడు, టెక్నీషియ‌న్స్ స‌మ‌క్షంలో విజ‌య్ దేవ‌ర‌కొండ కేక్ క‌ట్ చేశారు. అనంత‌రం అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడాడు రౌడీ బాయ్. ఖుషీ విజ‌యం సంతోషం క‌లిగించింద‌న్నాడు. తాము ముందే ఊహించామ‌ని చెప్పాడు.

తన‌కు ఛాన్స్ ఇచ్చిన మైత్రీ మూవీ మేక‌ర్స్ కు, ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌కు, సంగీత ద‌ర్శ‌కుడికి కంగ్రాట్స్ తెలిపాడు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌(Vijay Devarakonda). ఖుషీ మూవీని ఆద‌రిస్తున్న మీ అంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

త‌న‌కు ఇచ్చిన రెమ్యున‌రేష‌న్ నుంచి రూ. కోటి విరాళంగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఒక్కో ఫ్యామిలీకి రూ.ల‌క్ష చొప్పున 100 కుటుంబాల‌కు అందజేస్తాన‌ని చెప్పాడు. ఇందుకు సంబంధించి ఓ ఫాం కూడా ఇస్తామ‌న‌ని, త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లో ప్ర‌తి కుటుంబానికి తానే స్వ‌యంగా ఇస్తాన‌న్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. కొంద‌రు కావాల‌ని నెగ‌టివ్ కామెంట్స్ చేశార‌ని కానీ చిత్రం ఊహించ‌ని స‌క్సెస్ అయ్యింద‌న్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

Also Read : Kushi Celebrations : ఖుషీ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్

Comments (0)
Add Comment