Vijay Devarakaonda: ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు ఏడేళ్ళు ! సినిమాపై విజయ్ దేవరకొండ ఆశక్తికర పోస్ట్ !

'అర్జున్‌ రెడ్డి' సినిమాకు ఏడేళ్ళు ! సినిమాపై విజయ్ దేవరకొండ ఆశక్తికర పోస్ట్ !

Vijay Devarakaonda: విజయ్ దేవరకొండ, సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం అర్జున్ రెడ్డి. బాలీవుడ్ భామ షాలినీ పాండే హీరోయిన్‌ గా నటించింది. 2017 ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. విజయ్‌ దేవరకొండ, సందీప్‌ వంగా కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ మూవీగా నిలిచింది. కెరీర్‌ పరంగా వారి ఎదుగుదలకు ఈ సినిమా సక్సెస్‌ ఉపయోగపడింది. ఇది విడుదలై నేటితో ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ‘అర్జున్‌ రెడ్డి’ మేకింగ్‌ స్టిల్స్‌ ను హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakaonda) షేర్ చేశారు. అప్పుడే ఏడేళ్లు గడిచాయంటే నమ్మలేకుండా పోతున్నానంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఓ రిక్వెస్ట్ చేశారు.

Vijay Devarakaonda Movies..

విజయ్ తన ట్వీట్‌లో రాస్తూ.. ‘పదో వార్షికోత్సవానికి అర్జున్‌రెడ్డి ఫుల్‌ కట్‌ను అందుబాటులోకి తీసుకురా. అర్జున్‌ రెడ్డి విడుదలై ఏడేళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నా. ఇదంతా గత సంవత్సరంలోనే జరిగినట్లుగా అనిపిస్తోంది’ అంటూ మూవీ షూటింగ్‌ ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇది చూసిన అభిమానులు అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పదో వార్షికోత్సవానికి ఫుల్‌ వెర్షన్‌ విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రొమాంటిక్‌ డ్రామా ఫిల్మ్‌ గా తెరకెక్కించిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలో కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేని వ్యక్తిగా విజయ్‌ దేవరకొండ కనిపించారు. భద్రకాళీ పిక్చర్స్‌ పతాకంపై ప్రణయ్‌ రెడ్డి వంగా దీనిని నిర్మించారు. ఈ సినిమా ఒరిజినల్‌ రన్‌ టైమ్‌ దాదాపు 3.45 గంటలు. పలు కారణాల రీత్యా 3.02 గంటల నిడివితో దీనిని విడుదల చేశారు. అభ్యంతరకర పదాలు, ముద్దు సన్నివేశాల నిడివిని తగ్గించాలని సెన్సార్‌ బోర్డు కట్ చెప్పింది. తెలుగులో సూపర్‌హిట్‌ అందుకున్న ఈ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ , హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ చేశారు.

Also Read : Amy Jackson: పెళ్లి పీటలెక్కిన రామ్ చరణ్ బ్యూటీ అమీ జాక్సన్‌ !

arjun reddySandeep Reddy VangaShalini PandeyVijay Devarakaonda
Comments (0)
Add Comment