Love Guru Movie : విజయ్ ఆంటోనీ సినిమా నుంచి వైరల్ అవుతున్న ఎమోషనల్ సాంగ్

ఈ పాటకు భాష్యశ్రీ సాహిత్యం అందించారు. భరత్ ధనశేఖర్ స్వరాలు సమకూర్చారు

Love Guru : డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని. తన సినిమాలన్నింటినీ విజయ్(Vijay Antony) తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి విజయ్ ఆంటోని తొలిసారిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌లో నటిస్తున్నాడు మరియు తమిళంలో ఆయన నటించిన ‘రోమియో’ చిత్రం తెలుగులో ‘లవ్ గురు’గా విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తుంది. మీరా విజయ్ ఆంటోని బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు వినాయక్ వైద్యనాథన్. తాజాగా ఈ చిత్రంలోని ‘చెల్లెమ్మవే…’ అనే సెంటిమెంట్‌తో కూడిన సిస్టర్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

Love Guru Movie Updates

ఈ పాటకు భాష్యశ్రీ సాహిత్యం అందించారు. భరత్ ధనశేఖర్ స్వరాలు సమకూర్చారు. ఆదిత్య ఆర్కే పాడారు. ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే.. నా చెల్లివే.. నువు నా చెల్లివే.. నేనున్నదే నీ కోసమే.. విధి రాసెనే, ఒక రాతనే… ఆ ఆటలో ఎద కృంగెనే..’ అంటూ హీరో తన సోదరిని తల్చుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలతో ఎమోషనల్‌గా సాగుతుందీ పాట. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా గుండెను పిండేసే మూడ్‌తో ఉంటుందని ఈ పాటలో చూడొచ్చు.

పాట విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు భరత్‌ ధనశేఖర్‌ మాట్లాడుతూ – “ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కావడం కొత్త అనుభూతిని మిగిల్చింది. ఈ సినిమా విజయానికి నేను అందించిన సంగీతం కూడా కారణమని నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్ ఆంటోని. వీటీవీ గణేష్, తలైవాసర్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు విభిన్న పాత్రలు పోషించనున్నారు.

Also Read : Singapore Saloon OTT : ఓటీటీలో మీనాక్షి చౌదరి కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా

CommentsMovieSongTrendingUpdatesVijay AntonyViral
Comments (0)
Add Comment