Vijay Antony : తన కెరీర్ లోనే ‘తుఫాన్’ ఒక పెద్ద చిత్రం అంటున్న విజయ్

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ....

Vijay Antony : విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో, మేఘా ఆకాష్ మహిళా ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ;మలై పిడిక్కాద మణిధన్’ తెలుగులో తుఫాన్ పేరుతో విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో సత్యరాజ్, శరత్ కుమార్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇన్ఫినిటీ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, బి. ప్రదీప్, పంకజ్ బోరా మరియు డి. లలిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెలాఖరున చెన్నైలో ఇటీవల విడుదల చేశారు.

Vijay Antony Comment

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ.. విజయ్‌ ఆంటోని రోమియో చిత్రం ప్రారంభమైన సమయంలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించాం. ఈ కథను నమ్మి నాతో పాటు ప్రయాణం చేసినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు. నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ ‘‘ఒక మనిషి గతం.. మరొకరి భవిష్యత్తు. అన్నదే ఈ సినిమా కథ. ట్రైలర్ లాగానే ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) మాట్లాడుతూ ‘‘దేశంలోని అత్యుత్తమ సినిమాటోగ్రాఫర్‌లలో ఒకరైన నా స్నేహితుడు విజయ్‌ మిల్టన్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ ఫిల్మ్. అంతే కాదు శరత్ కుమార్, సత్యరాజ్, శరణ్య మురళీశర్మ, డాలీ ధనుంజయన్ వంటి వారితో కలిసి పని చేస్తానని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు.

Also Read : Nayanthara : విష్ణు వర్ధన్ నా ఫామిలీ అందుకే ఇక్కడికి వచ్చానంటున్న నయన్

CommentMoviesTrendingUpdatesVijay AntonyViral
Comments (0)
Add Comment