Vijay Antony : సంచలన నిర్ణయం తీసుకున్న బిచ్చగాడు హీరో

ఆయన ఇటీవల విడుదలైన బిచ్చగాడు 2, లవ్ గురు చిత్రాలు విజయవంతమయ్యాయి....

Vijay Antony : కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బిచ్చగాడు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తమిళంతో పాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, గాయకుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ‘బిచ్చగాడు’ సక్సెస్ తర్వాత విజయ్ ఆంటోని నటించిన సినిమాలన్నీ తెలుగులో విడుదల కానున్నాయి.

ఆయన ఇటీవల విడుదలైన బిచ్చగాడు 2, లవ్ గురు చిత్రాలు విజయవంతమయ్యాయి. విజయ్ ఆంటోని ప్రస్తుతం తుఫాన్ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలిత, ప్రదీప్, పంకజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా విజయ్ మిల్టన్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు కూడా సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకల్లో హీరో విజయ్ ఆంటోనీ చెప్పులు లేకుండా కనిపించారు.

Vijay Antony Comment

ప్రశ్నించగా విజయ్ ఆంటోని ఆసక్తికర సమాధానమిచ్చాడు. “కొన్ని రోజుల క్రితం, నేను చెప్పులు లేకుండా నడుస్తున్నాను మరియు ఆ తర్వాత నేను చాలా బాగున్నాను. ఇది చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇది మన ఆరోగ్యానికి మంచిది. ఇది మన విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. నేను చెప్పులు లేకుండా నడవడం ప్రారంభించినప్పటి నుండి నేను ఒత్తిడికి గురికాలేదు. నా జీవితాంతం చెప్పులు లేకుండా ఉంటాను”. ఇప్పుడు విజయ్ ఆంటోని(Vijay Antony) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

కొన్ని నెలల క్రితం విజయ్ ఆంటోని పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఒత్తిడి తట్టుకోలేక మృత్యువుకు చేరువలో ఉన్నానని సూసైడ్ నోట్ రాసింది. కూతురు చనిపోవడంతో విజయ్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. తన భవిష్యత్ సామాజిక కార్యక్రమాలన్నీ కూతురు పేరు మీదనే ఉంటాయని గతంలో ప్రకటించారు. ఇదిలా ఉంటే, జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కెవి కూడా చెప్పులు వేసుకోవడానికి ఆసక్తి లేదని చెప్పారు. నివేదికల ప్రకారం, చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read : Gangs of Godavari : ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లో హీరో ఛాన్స్ ఆ హీరో మిస్ చేసుకున్నాడా…?

BreakingCommentsVijay AntonyViral
Comments (0)
Add Comment