Vijay Antony : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ, రియా సుమన్ జంటగా నటించిన సినిమా ‘హిట్లర్’. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ సంయుక్త నిర్మాణంలో ధన దర్శకత్వం వహించిన ఈ సినిమాను త్వరలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. దీనితో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించిన చిత్ర యూనిట్ తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది.
Vijay Antony Movie Updates
‘‘ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ ΄పౌరుడి కథే ఈ ‘హిట్లర్’. ఈ సినిమాలో లవ్ ట్రాక్‌కి కూడా ప్రాధాన్యత ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ ‘హిట్లర్’లో కిల్లర్‌గా విజయ్ ఆంటోని కొత్త లుక్ లో, క్యారెక్టరైజేషన్‌లో కనిపిస్తారు’’ అని చిత్ర యూనిట్ తెలిపింది.
Also Read : Vijayakanth No More : విజయకాంత్ చావుకి కారణాలు ఇవేనా..?