Vijay Antony: తనకు మెమరీపవర్ తక్కువ అంటోన్న విజయ్ ఆంటోని !

తనకు మెమరీపవర్ తక్కువ అంటోన్న విజయ్ ఆంటోని !

Vijay Antony: వైవిధ్యభరితమైన థ్రిల్లర్‌ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్‌ ఆంటోని(Vijay Antony). ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్‌ జానర్‌లో ‘లవ్‌ గురు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్‌ వైద్యనాథన్‌ తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో విజయ్ ఆంటోని… సినిమా విశేషాలు పంచుకున్నారు.

Vijay Antony Comment

ఈ సందర్భంగా హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) మాట్లాడుతూ… ‘‘వ్యక్తిగతంగా నేనెప్పుడూ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. వర్తమానంలోనే జీవిస్తుంటా. ఎందుకంటే మనం ఒకటి కోరుకున్నప్పుడు ఇంకొకటి దక్కితే నిరాశ పడాల్సి వస్తుంది. మనకు ఏది కావాలో… ఏది ఇవ్వాలో విశ్వం చూసుకుంటుంది. ఈ చిత్ర విషయంలోనూ నేను ఇలాగే ఆలోచించా. ఈ కథ విన్నప్పుడు సినిమా సాధించబోయే విజయంపై నమ్మకం కలిగింది’’. ‘‘దర్శకుడు తన జీవితంలో చూసిన అనుభవాలతో ఈ కథ సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ కామెడీని చూస్తారు. ఈ సినిమా చూశాక మీ జీవిత భాగస్వామిని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారు’’.

‘‘నాకు మెమొరీ పవర్‌ తక్కువ. తెలుగు భాష నేర్చుకోలేకపోయాను. నాకు తెలుగు వచ్చి ఉంటే నేరుగా తెలుగులోనే సినిమాలు చేసేవాణ్ని. అలాంటి అవకాశం ఉంటే చెన్నై వదిలి వచ్చి ఇక్కడే సినిమాలు చేస్తా. ప్రస్తుతం మా ప్రొడక్షన్‌లో మూడు చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి. నేనొక సినిమా చేస్తే ఆ సినిమాకు నిర్మాణ బాధ్యతలు, ఎడిటింగ్, నటించడం, అన్ని భాషల్లో ప్రమోషన్ చేయడం వీటికే టైమ్ సరిపోతోంది, ’’ అని అన్నారు.

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా లవ్ గురు సినిమాను రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉంది. నేను ఎప్పటినుంచో ఈ సంస్థతో అసోసియేట్ అవడానికి ఎదురు చూస్తున్నాను. సినిమా పట్ల ప్యాషన్ ఉన్న బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్. నేను తమిళంలో మూవీస్ చేస్తుంటాను. ఇక్కడ రిలీజ్ కు సరైన వాళ్లు దొరకక ఇబ్బందులు పడ్డాను. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ తో ఇకపైనా మా రిలేషన్ కొనసాగుతుంది. నేను ఫ్యూచర్ లో ఎంత గొప్ప సినిమా చేసినా అది బిచ్చగాడు సినిమా కంటే గొప్ప మూవీ కాలేదు.

అయితే లవ్ గురు కూడా నాకు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని అందిస్తుంది. ఇందులో లేడీస్ సెంటిమెంట్ ఉంటుంది. బిచ్చగాడు సినిమాతో చూస్తే కనీసం 80 శాతం ఎమోషన్ లవ్ గురు కథలోనూ ఉంది. 2026 సమ్మర్ లో బిచ్చగాడు 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా. నా కెరీర్ లో బిచ్చగాడు 3 బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. ఈ సినిమాకు నేనే దర్శకత్వం చేస్తాననుకుంటా. ప్రస్తుతం మా ప్రొడక్షన్ మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఒకటి అక్టోబర్ లో మరొకటి సంక్రాంతికి ఇంకో సినిమా నెక్ట్ సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నాం.

Also Read : Hero Vijay: తల్లి కోసం గుడి కట్టించిన హీరో విజయ్ !

Love GuruVijay Antony
Comments (0)
Add Comment